కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. తాము కరోనా బారిన పడ్డామన్న విషయాన్ని కూడా తెలియనివ్వకుండా నిలువెత్తు మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది.  ఒకప్పుడు మనుషులు గుంపులుగా ఉండేవారు.. కానీ ఈ కరోనా వైరస్ వల్ల మనిషిని చూస్తే మనిషి భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఐనవాళ్లు తప్ప పరాయి వాళ్లను దగ్గరకు రానివ్వని స్థితి.  బయటకు వస్తే సామాజిక దూరం పాటించాలని గట్టి ఆంక్షలు వినిపిస్తున్నాయి.  దానికి కారణం కరోనా వైరస్ మనిషి నుంచి వెంటనే వ్యాప్తి చెందుతుంది.  అసోంలో పాజిటివ్‌గా తేలిన 82 శాతం మందికి కరోనా లక్షణాలు కనపడలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మిమంత బిష్వా శర్మ ప్రకటించారు.

 

 'ఈ వైరస్‌ నిశ్శబ్దంగా తన పనిచేసుకుపోతోంది. చికిత్స చేస్తోన్న సమయంలోనూ చాలా మందికి కరోనా లక్షణాలు కనపడలేదు' అని శర్మ వెల్లడించారు.  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరమే ప్రధాన అస్త్రమని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటిస్తేనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం  తప్పుతుంది.  మొదటి నుంచి లాక్ డౌన్ విధించడం.. మనుషుల మద్య సామాజిక దూరం ఎందుకు ఉండాలన్న విషయాం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రక రకాలుగా చెబుతున్నారు.

 

ఈ నేపథ్యంలో  కరోనా సోకిన వ్యక్తి నుంచి బహిరంగ ప్రదేశాల్లో  వైరస్ ఎంత దూరం ప్రయాణిస్తుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేసింది.  కరోనా బాధితుడు నిశ్వాసంలో ఉన్నప్పుడు అతని నుంచి 1.5 మీటర్ల వరకూ వైరస్ ప్రయాణిస్తుంది. అదే ఆ వ్యక్తి దగ్గినప్పుడు వైరస్ రెండు మీటర్ల వరకు వెళ్తుంది. తుమ్మినప్పుడు మాత్రం ఏకంగా ఎనిమిది మీటర్ల దూరం వరకూ ప్రయాణిస్తుందని ఓ చిత్రం ద్వారా విశిదీకరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: