ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉన్నా ఇప్పుడు కేంద్ర అధికార పార్టీ బిజెపి, ఏపీ అధికార పార్టీ వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో పోరు పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసిపి రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మధ్య కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఒకరిపై ఒకరు  తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభించిన తరువాత కొద్ది రోజులు పాటు ఏపీ బిజెపి నాయకులు సైలెంట్ గానే ఉన్నా, కరోనా టెస్ట్ కిట్లపై మాటల యుద్ధానికి ఆ పార్టీ దిగింది. ముఖ్యంగా వైసీపీ, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి కరోనా రాపిడ్ టెస్ట్ కిట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగుతోంది.

 

 

ఛతీస్ ఘడ్ ఇదే కిట్లను 337 రూపాయలకి కొనుగోలు చేయగా, ఏపీ ప్రభుత్వం 730 రూపాయిలు కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ రెండు పార్టీల మధ్య వివాదం చెలరేగింది. దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన కరోనా కిట్ల అంశాన్ని ప్రస్తావిస్తూ కరోనా కిట్ల విషయాన్ని ప్రస్తావిస్తూ, వాటి కొనుగోలులో కమిషన్ కొట్టారా లేదా ..? పక్క రాష్ట్రం చత్తీస్ ఘడ్ 337 ప్లస్ జిఎస్టి తో కొన్నారు. మరి మీరు ఇంతకు  తెచ్చారు. ఈ రెండు కిట్ల రేట్లలో తేడాని ప్రజలకు చెప్పి ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవాలి అంటూ కన్నా ట్వీట్ చేశారు.


దీనిపై విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్ల రూపాయలతో చంద్రబాబుకు అమ్ముడుపోయారని, మాజీ ఎంపీ సుజనా చౌదరి ద్వారా ఈ డీల్ జరిగిందని ఆయన విమర్శలు చేశారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ఉద్దేశించి విజయసాయిరెడ్డి పెట్టినట్టు బాగా వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా మోడీ గారి ఇమేజ్ పెరిగినా, రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడుపోయిన కన్నా లాంటి వారే కారణం. బాబు ప్యాకేజీ ఆఫర్ ఎలా ఉంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్న వారిని లేపి కూర్చోబెట్టినట్టు ఉంది. మొదటి నుంచి బిజెపి లో ఉన్నవారు కన్నా లాంటి జంబూకాలను వదిలించుకోవాలి అంటూ విజయ్ సాయి రెడ్డి ట్విట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.దీనిపై స్పందించిన కన్నా విజయసాయి రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: