ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. దేశంలో కరోనా లెక్కలు రోజు రోజకీ పెరిగిపోతున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చేయడానికి ముఖ్యమంత్రులు శాయశక్తులా ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.  కరోనా వైరస్ కట్టడి చేయడానికి మే 7 వరకు పొడగించాల్సి వస్తుందని అన్నారు.  రాష్ట్రంలో కరోనా వైరస్ ను పూర్తిగా అరికట్టేందుకే సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌ ను మే 7 వరకు పోడిగించారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తెలిపారు.

 


మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందిన తరువాత ప్రభుత్వ నిబంధనలను పాటించని కొన్ని నగరాలు, పట్టణాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ఇప్పుడు అక్కడి ప్రజలు భాధపడుతున్నారని ఆయన అన్నారు.  లాక్ డౌన్ పాటించని దేశాలు ఇప్పుడు ఎన్ని అవస్థలు పడుతన్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు.  ఇటలీ, యూరప్‌ వంటి అగ్రదేశాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మనం నిత్యం అక్కడి పరిస్థితులను చూస్తూనే ఉన్నామని ఆయన అన్నారు.

 


ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాల పరిస్థితి చూసి   సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను పోడిగించడం జరిగిందని చెప్పారు. సరా పెన్షన్లు చెల్లించడానికి రూ. 875 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. వృద్ధులకు వితంతువులకు ఇచ్చే పెన్షన్లు యధావిధిగా ఇస్తున్నామన్నారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: