ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తోంది. ఎక్కడ చూసినా ఇదే భయం కనిపిస్తుంది. కంటికి కనిపించకుండా దాడిచేసి ఎక్కడ కాటికి పంపిస్తుందోనని  భయం తోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం గుప్పిట్లో బతుకును వెళ్లదీస్తున్నారు. కానీ కరోనా వైరస్ కాలాన్ని అదునుగా భావించిన కొంతమంది దుండగులు యథేచ్ఛగా  తాము చేయాల్సింది చేసేస్తున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.. ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ ఎఫెక్ట్  తో అల్లకల్లోలం అవుతుంటే... కెనడాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరోనా  వైరస్ భయం కాదు కెనడాలో కాల్పుల భయం మొదలైంది. మొన్నటి వరకూ కరోనా వైరస్ భయంతో బతికిన అక్కడి ప్రజలు ఇప్పుడు ఎటు నుంచి ఎవరో వచ్చి కాల్చేస్తారో  అనే భయంతో బతుకుతున్నారు. 

 

 తాజాగా కెనడా లో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఏకంగా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చిన ఓ దుండగుడు.. కాల్పులకు తెగబడ్డార. నోవా స్కోటియా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో పోలీస్ సహా 16 మంది మృత్యువాత పడడం గమనార్హం. ఈ ఘటన కెనడా లో సంచలనం సృష్టించింది. ఓవైపు కరోనా వైరస్ సోకుతుందేమో అనే భయంతో బతుకుతున్న కెనడా ప్రజలకు మరింత ఆందోళన కలిగించే అంశం ఇది . అయితే పోలీస్ డ్రెస్ లో వచ్చిన దుండగుడు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడి పై ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో సదరు దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం

 

 

 ఇక ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు స్థానిక యంత్రాంగం... ఇప్పటికే కరోనా  వైరస్ వల్ల లాభం లో ఉన్న ప్రజలెవరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టకూడదు అని సూచించారు. అయితే పోలీస్ డ్రెస్ లో వచ్చి కాల్పులకు తెగబడిన దుండగుడు.. అతని వాహనం కూడా పోలీసు వాహనం లాగానే రూపొందించాడు అని పోలీసులు తెలిపారు. అయితే సదరు దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కెనడా ప్రజలందరికీ కరోనా వైరస్ భయం ఉంటే ఇక్కడ కాల్పులు జరగడం వారికి మరింత భయాందోళనకు గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: