ప్రపంచంలోని చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన దిక్కుమాలిన కరోనా వైరస్ మనిషిక కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది.  మన దేశంలో కూడా కరోనా నానా బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే. దేశంలో నానాటికీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.  ఈ కరోనా వల్ల లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో రవాణా వ్యవస్థ కుటుంబ పడింది.  దాంతో నిత్యం సరఫరా అయ్యే నిత్యావసరాల సరుకుల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది.  కరోనా ప్రభావం తమలపాకు పంటలపై పడింది. లాక్ డౌన్ తో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో చేతికొచ్చిన పంట పొలాల్లోనే ముదిరిపోతుంది.

 

లక్షలాది రూపాయలను తమలపాకుల యాజమానులు నష్టపోతుండగా, కూలీల ఉపాధికి గండిపడుతుంది. శాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని ధర్మవరం, వమ్మవరం, పెనుగొల్లు, సోముదేవపల్లి తదితర గ్రామాలలో సుమారు 100 ఎకరాలలో తమలపాకు తోటలను రైతులు సాగుచేస్తున్నారు. తమలపాకు పంట అంటే ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పంట చేతికి వచ్చేవరకు చంటిపాపలా చూసుకోవాల్సి వస్తుంది.  కరోనా నేపథ్యంలో గత మార్చి నుంచి దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉన్నందున రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.

 

పాన్ షాప్ లు బంద్ అయ్యాయి. శుభ కార్యాలు వాయిదాపడ్డాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో పండిన తమలపాకు పంటలను తుంచకుండా తోటలలోనే ఉంచివేయడంతో ఆకులన్నీ ముదిరిపోయి , కుళ్ళిపోతున్నాయి. దాంతో వీటిని సాగు చేస్తున్న రైతుల సరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.  లాక్ డౌన్ నేపథ్యంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తమలపాకు రైతులకు ప్రభుత్వం ప్రత్యేక నష్టపరిహారం ఇవ్వాలని అంటున్నారు స్థానిక రాజకీయ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: