చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా దెబ్బకు అతలాకుతలమవుతున్నాయి. వైరస్ పుట్టుకకు కారణమైన చైనాపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవ్వడంతో పాటు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకి 40,000 మంది మృత్యువాత పడ్డారు. గత కొన్ని రోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మండిపడ్డారు. ప్రపంచం మీదకు కరోనా వైరస్ ను ఉద్దేశపూర్వకంగా పంపారని తేలితే చైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యునైటెడ్‌ కింగ్‌డం కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని.... చైనా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉండగా తాజాగా తమకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చాలని చైనాకు జపాన్ లేఖ రాసింది. 
 
130 బిలియన్ల బ్రిటిష్ పౌండ్లు తాము నష్టపోయామని.... చైనా ఆ మొత్తాన్ని చెల్లించాలని జర్మనీ ప్రభుత్వం కోరింది. జర్మనీ వార్తాపత్రిక్ బిల్డ్ 130 బిలియన్ల బ్రిటిష్ పౌండ్లు చెల్లించాలని ఇన్‌వాయిస్‌ పంపిందని కథనం ప్రచురించింది. తమ దేశానికి కలిగిన ఆర్థిక నష్టాన్ని చైనా పూడ్చాలని జర్మనీ ఇన్‌వాయిస్‌ లో పేర్కొంది. చైనా జర్మనీ పంపిన ఇన్‌వాయిస్‌ పై స్పందించింది. 
 
జపాన్ ఇలా ఇన్‌వాయిస్‌ పంపడం జాతీయవాదం, విదేశాలపై వ్యతిరేఖతను రెచ్చగొట్టడమే అని చైనా వ్యాఖ్యలు చేసింది. వాషింగ్టన్‌కు చెందిన న్యాయవాది లారీ క్లేమన్‌ కూడా కరోనా వైరస్‌ను సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ చైనాపై 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బిల్డ్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ తాము పత్రికాముఖంగా కరోనా వల్ల జరిగిన నష్టాన్ని చైనా పూడుస్తుందా అని ప్రశ్నించామని... చైనా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కరోనా గురించి ముందే తెలిసినా హెచ్చరించలేదని చైనా తీరుపై విమర్శలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: