కరోనా మించినది ఇపుడు ఏదీ లేదు. అది చండశాసనిగా ఉంది. అది ఏం చెబితే అదే జరగాలి. దానికి మించి ఒక్క అడుగు కూడా ఎవరూ వేయలేకపోతున్నారు. అన్ని ఆపేసుకుని, నోళ్ళు మూసేసుకుని కరోనా వైపు చూడడమే మిగిలింది.

ఇక భారత దేశ  రాజకీయాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇపుడు చర్చలోకి వస్తున్నారు. వారిద్దరికీ ఒకే రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అవేంటి అంటే ఇద్దరూ సీట్లో ఇంకా కుదురుకోవడంలేదు. వారి సమస్యలు అలా ఉండగానే కరోనా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది.

 

వారిలో ఒకరు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్. ఆయన కరోన ఏపీలో ప్రారంభ దశలో ఉండగానే రాజకీయం ఆడేసి కాంగ్రెస్ సీఎం కమలనాధ్ ని గద్దె దించేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సరే సీఎం కుర్చీ ఎక్కారు కానీ మంత్రులు లేకుండానే పాలన చేస్తున్నారు.

 

ఆ రాష్ట్రంలో కరోనా వీర విహారం చేస్తోంది. శివరాజ్ చౌహాన్ మాత్రం ఒక్కరే కష్టపడాల్సివస్తోందిట. మంత్రులు లేరు. కనీసం ఆరోగ్య మంత్రిని అయినా తీసుకోలేదు. దాంతో కాంగ్రెస్ ఆయన మీద విమర్శలు చేస్తోంది.

 

కరోనా  తీవ్రంగా ఉండడంతో మంత్రి వర్గం ఏర్పాటుకు వీలు లేకుండా పోయిందిట. దాంతో శివరాజ్ చౌహాన్ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇదే రకమైన బాధను మరో సీఎం అనుభవిస్తున్నారు.

 

ఆయన మహారాష్ట్ర సీఎం. ఆయన గద్దెనెక్కి ఆరు నెలలు అవుతోది. కానీ ఆయన ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యుడు కాదు. దాంతో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయాలి. దానికైనా నోటిఫికేషన్ ఇవ్వాలి.

 

మరి దానికి కూడా కరోనా అడ్డుగా ఉందిట. దాంతో తన పదవి ఉంటుందా. లేక రాజీనామా చేసి మళ్ళీ సీఎం గా ప్రమాణం చేయాలేమోనని ఆలోచిస్తున్నారుట. మొత్తానికి కరోనా ఈ ఇద్దరు జాతకాలనూ తిప్పేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: