కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రతి విషయాన్ని మీడియాతో పంచుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో వైరస్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు మొహమాటం లేకుండా సూటిగా విలేకర్ల సమావేశంలో తెలియజేస్తున్నారు. వైరస్ యొక్క తీవ్రతను తెలియజేస్తూ ఏ విధంగా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి అన్న దాని గురించి వివరణ చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో కేసీఆర్ ఇస్తూ పగడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపు ల విషయంలో కేంద్రం విధించే విధి విధానాలను అనుసరించే ప్రసక్తిలేదని.. రాష్ట్రంలో నార్మల్ పరిస్థితి వచ్చే వరకూ లాక్ డౌన్ తొలగించే విషయం లేదని తేల్చి చెప్పారు. ఇదే టైం లో విద్యాసంస్థల యాజమాన్యాలకు అదేవిధంగా అద్దె యజమానులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

 

పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఇటువంటి టైములో మానవత్వంతో ఆలోచించాలని అద్దె విషయంలో ఎవరు ఒత్తిడి చేయకూడదని ఇంటి యజమానులకు కే‌సి‌ఆర్ సూచించారు. ఎవరైనా అద్దె కట్టాలి అని ఒత్తిడి తీసుకు వస్తే వెంటనే వందకి ఫోన్ చేయాలని పేర్కొన్నారు. కఠినమైన చర్యలు వాళ్లపై తీసుకుంటామని ఈ సందర్భంగా సూచించారు. అదే టైంలో స్కూల్ యాజమాన్యాలు రానున్న విద్యా సంవత్సరానికి ఫీజు విషయంలో ఒక రూపాయి పెంచకూడదు అంటూ స్పష్టం చేశారు.

 

అంతేకాదు.. ఇప్పటివరకూ అమలవుతున్నట్లుగా టర్మ్ ఫీజులు వసూలు చేయకుండా.. ఏ నెలకు ఆ నెల మాత్రమే వసూలు చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. దీంతో కే‌సి‌ఆర్ ప్రెస్ మీట్ చూసిన ఏపీ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ విధంగానే కే‌సి‌ఆర్ నిర్ణయాలను ఫాలో అవ్వాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మానవత్వం గా కొంచెం ఆలోచించి కే‌సి‌ఆర్ తీసుకున్న నిర్ణయాలు ఏపీలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: