ఏపీలో చూస్తే జగన్ ఒంటరి వాడుగా కనిపిస్తున్నారు. ఆయన మీదకు విమర్శలు చేయడానికి  బీజేపీ నుంచి అన్ని పార్టీలు కూడా రెడీగా ఉంటున్నాయి. టీడీపీ అయితే సరే సరి. రాజకీయంగా జగన్ మీద విమర్శలు చేయవచ్చు కానీ సమయం సందర్భం లేకుండా కూడా విపక్షాలు రెచ్చిపోవడం కూడా ప్రతీ ఒక్కరూ చూస్తున్నదే.

 

ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ జగన్ కి అండగా ఉంటున్నారు. ఆయన దేశానికి తండ్రిగా ఉంటున్నారు. జగన్ విషయంలో మొదటి నుంచి ఆప్యాయతను చూపిస్తున్నారు. కరోనా సమయంలో ప్రధాని మోడీ చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు.

 

ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆయన మాట్లాడుతున్నారు. తరచూ ఫోన్ చేసి మరీ కరోనా నియంత్రణకు ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇక ఏపీ సీఎం కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు ఎప్పటికపుడు ప్రధానికి వివరిస్తున్నారు. ఆయన సలహాలు తీసుకుంటున్నారు.

 

ప్రధాని మోడీ కూడా మెచ్చుకుంటున్నారు. సరిగ్గానే ఏపీ సర్కార్ స్పందిస్తోందని కితాబు ఇస్తున్నార‌ని భోగట్టా.
 ఇటీవల దక్షిణ కొరియా నుంచి రాపిడ్ కిట్లు తెప్పించి కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జగన్ చెప్పగానే ప్రధాని మెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. 

 

ఇక ఏపీకి సమంధించి ఏమైనా సమస్యలు ఉంటే తనతో సంప్రదించాలని కూడా ప్రధాని జగన్ని కోరడం విశేషం. తానున్నానని ప్రధాని భరోసా ఇవ్వడం ఈ టైంలో ఏపీకి, ముఖ్యంగా జగన్ కి మంచి ఊరటగా చెబుతున్నారు.

ఏపీలో చూస్తే బీజేపీ నేతలు ప్రతీ దానికీ జగన్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నాయి. దానికి రాపిడ్ కిట్ల కొనుగోలు పెద్ద ఉదాహరణ. అవినీతి బాగా జరిగిపోయిందని నానా యాగీ పెడుతున్నారు. చివరికి ప్రభుత్వం  సరైన చర్యలు తీసుకుంది కూడా. 

 

ఎక్కడ టీడీపీ కంటే వెనకబడిపోతామోనని బీజేపీ నాయకులు జగన్ మీద ఇలా విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీ బీజేపీ ఇలా ఉన్నా కూడా మోడీ సానుకూలంగా స్పందించడం మంచి పరిణామమే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: