కరోనా వైరస్ కట్టడి చేయడంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. దేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన రాష్ట్రంగా కేరళ అప్పట్లో వార్తల్లో సంచలనంగా నిలిచింది. అయితే తాజాగా మాత్రం కరోనా వైరస్ రికవరీ కేసుల విషయంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ముందంజ లో ఉంది. ఎక్కువ కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగులు రికవరీ అవుతున్నది కేరళ రాష్ట్రంలో మాత్రమే.

 

దీంతో వైరస్ కట్టడి చేయడం విషయంలో పూర్తి అవగాహన కల్పించుకున్న కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా చోట్ల లాక్ డౌన్ కు మినహాయింపులు ఇవ్వటం లో సంచలన నిర్ణయాలు తీసుకుంది. రవాణా మరియు రెస్టారెంట్లు ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో వైరస్ పరిస్థితి పట్టి జోన్లుగా వివరించి..ఏ జోన్ కి తగ్గ ఆ జోన్ కి నియమ నిబంధనలు తీసుకొచ్చింది.

 

ఈ సందర్భంగా వైరస్ పరిస్థితి బట్టి రాష్ట్రం లో ఉన్న ప్రాంతాలను ...రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ గా విభజించింది. దీంతో కేరళ అనుసరిస్తున్న ఈ మంత్రాన్ని ప్రపంచమంతా అనుసరించబోతోంది అని సమాచారం. రవాణా విషయంలో బస్సులో 40 మందికి కూర్చునే కెపాసిటీ ఉంటే దాన్ని 20 కి చేస్తూ సగానికి సగం కట్ చేసి, రవాణా రంగాన్ని పునరుద్ధరించే లా కేరళ ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. ఈ విధంగా ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని పునరుద్ధరించడానికి కేరళ సర్కార్ అడుగులు వేస్తోంది. చాలా వరకు మనుషులు గుంపులుగుంపులుగా ఉండే పరిస్థితి రాకుండా కేరళ ప్రభుత్వం చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంది.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: