మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఇతరులు అనేక రకాలుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ పుట్టిన రోజు శుభాకాంక్షలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ జర్నలిస్ట్ చంద్రబాబు రాజకీయాల్లో ఎలా ఎదిగారో చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. 
 
అబ్దుల్ ఖాజా హుస్సేన్ అనే జర్నలిస్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మొదటి ప్రాధాన్యత దగ్గుబాటికి ఇచ్చేవారని... ఒక ప్రత్యేక బృందం ఎన్టీయార్ కు సలహాలు, సూచనలు ఇచ్చేదని... కేంద్ర ప్రభుత్వం పదవికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చిన పర్వతనేని... గండిపేట ఇంటలెక్చువల్స్ అని ఒక బ్యాచ్ ఉండేదని చెప్పారు. ఐదుగురు మేధావులు ఎన్టీయార్ కు సలహాలు ఇచ్చేవారని ఆయన కూడా సలహాలు ఫాలో అయ్యేవారని అన్నారు. 
 
చంద్రబాబు టీడీపీలో చేరిన తరువాత ఎన్టీయార్ దగ్గర ఉన్న మేధావుల బృందంతో చేరి వారు బాబు తెలివితేటలను గుర్తించేలా చేసుకున్నారని అన్నారు. ఆ బృందం చంద్రబాబు గురించి పాజిటివ్ గా చెప్పడంతో ఎన్టీయార్ కు చంద్రబాబుపై సదభిప్రాయం ఏర్పడిందని... అనంతరం ఎన్టీయార్ చంద్రబాబు పార్టీ కార్యాలయం నడిపే బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. 
 
అనంతరం ఒక సందర్భంలో ఎన్టీయార్ మేధావుల బృందంలో ఒకరైన ఉపేంద్రతో చంద్రబాబుకు పార్టీ కార్యకలాపాలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నట్టు చెప్పడం జరిగిందని ఆ వార్త ఈనాడు పత్రికలో కూడా వచ్చిందని అన్నారు. ఆ వార్త రాసిన అబ్దుల్ ఖాజా హుస్సేన్ ఆ తరువాతే ప్రజల్లో, పార్టీలో చంద్రబాబుకు గుర్తింపు వచ్చిందని గుర్తు చేసుకున్నారు.  లాక్ డౌన్ వల్ల చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ లోని ఇంట్లో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు.            

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: