ఇప్పుడంతా క‌రోనా టెన్ష‌నే. ప‌ల్లె, ప‌ట్నం అనే తేడా లేకుండా కరోనా వైరస్ సోకకుండా ఉండాలని ఎంతోమంది అనుకుంటున్నారు. కానీ పాజిటివ్ కేసుల సంఖ్య‌తో బేంబేలెత్తిపోతున్నారు. తాము ఆ జాబితాలో చేర‌కుండా మాస్క్‌లు, గ్లౌజ్‌లు వేసుకుని జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో తాము ఆ వ్యాధి బారిన ప‌డ‌వ‌ద్ద‌ని కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి ఈ వ్యాధి స‌మ‌స్య ఎక్కువ ఉంద‌నే సందేహం స‌హ‌జంగానే వ‌స్తుంది. వైద్యుల విశ్లేష‌ణ ప్ర‌కారం గుండె వ్యాధిగ్రస్తులు, మధుమేహం, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు మధ్య వాల్వ్ లాంటి సమస్యలు ఉంటే వారికి ఈ ముప్పు ఎక్కువ ఉంటుంది.

 

గుండె వ్యాధి గ్రస్తులు, మధుమేహం వంటివి ఉంటే మాత్రం రోగ నిరోధక శక్తి శరీరంలో తక్కువగా ఉంటుందని.. దీంతో వైరస్ సోకే ప్రభావం ఉందని వైద్యులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఒకవేళ వైరస్ సోకితే మాత్రం తట్టుకునే సామర్థ్యం ఉండదని పేర్కొంటున్నారు. కాబట్టి పొగతాగడం, మ‌ద్యం తాగ‌డం పూర్తిగా మానెయ్యాలని వారు సూచిస్తున్నారు. న్యూయార్క్ వంటి దేశాల్లో ఇలాంటి వ్యాధులు ఉన్న వారు ఎక్కువగా ఉండడం వల్ల అధికంగా మరణాలు చోటుచేసుకున్నాయని హృద్రోగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్-19 సోకిన వ్యక్తుల్లో 15 శాతం మందికి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, వీరు వైరస్ నుంచి కోలుకున్నాక కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

 

కాగా, లాక్‌డౌన్ ఎఫెక్ట్ అన్నిరంగాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డిందని అంతర్జాతీయ కార్మిక సంఘం తెలిపింది. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పరిస్థితులు మరింత దయనీయంగా మారనున్నాయని ఐఎల్ఓ అంచనా వేసింది. గత 75 ఏళ్ల చరిత్రలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంతటి సంక్షోభ పరిస్థితుల్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని స్ప‌ష్టం చేసింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని లెక్కగట్టింది. భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా.. ప్ర‌జ‌లు ఉపాధి కోల్పోయారని.. మార్చి నెలాఖ‌రు నాటికి 38.2శాతం, నిరుద్యోగ స‌మ‌స్య 8.7శాతానికి ప‌డిపోయింద‌ని వెల్ల‌డించింది. ఏప్రిల్ నెలాఖ‌రు నాటికి సుమారుగా 50 మంది ద‌గ్గ‌ర పైసా లేకుండా పోతుంద‌ని వివ‌రించింది. మొత్తానికి క‌రోనా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర‌ప్ర‌భావాన్ని చూపెడుతుంద‌ని పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: