కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా  తమ పిల్లల చదువులు పాడవుతున్నాయని ఆందోళన చెందుతోన్న తల్లితండ్రులకు తెలంగాణ సర్కార్ శుభవార్త విన్పించింది . ఇక నుంచి ఆన్ లైన్ లో డిజిటల్  విద్యాబోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి , ఆన్ లైన్ క్లాసుల విద్యా బోధన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు . ఈ అవకాశాన్ని తెలంగాణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని  ఆమె కోరారు . లాక్ డౌన్ కారణంగా  ఇప్పటికే పదవతరగతి విద్యార్థుల పరీక్షలు అర్ధాంతరంగా నిలిపోయిన విషయం తెల్సిందే .

 

విద్యార్థులు తాము చదుకున్న పాఠాలు మర్చిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని విద్యా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు . అదే సమయం లో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులను  పరీక్షలు లేకుండానే  పై క్లాసులకు ప్రమోట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . దీనితో వారు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్తుండడం వల్ల, వారికి పాఠ్య పుస్తకాల్లోని పాఠాలపై ఉన్న పరిజ్ఞానం ఎంత అన్నది తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది . పరీక్షలు రాయకుండానే  పై  క్లాసులకు వెళ్లిన  వారికి కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా ఎంతో మేలు జరిగే   అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు .

 

ఈ నెల 21  వ తేదీ   నుంచి టి శాట్ ఛానల్ ద్వారా ప్రతి రోజు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి  విద్యార్థులకు ప్రతి రోజు ఒక పాఠాన్ని బోధించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు . అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత ప్రతి రోజు ఆన్ లైన్ తరగతులు నిర్వహించడాన్ని టి శాట్ ఛానల్ అన్ని ఏర్పాట్లు చేసిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: