ఆంధ్రాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందులోనూ ఇప్పుడు కరోనా టెస్టుల సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి. అయితే మొదటి నుంచి కరోనా కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాలు ఎక్కువగా కేసులు నమోదయయ్యాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఓ జిల్లా కరోనా కేసుల విషయంలో హాట్ టాపిక్ అయ్యింది.

 

 

అదే చిత్తూరు జిల్లా.. ఈ జిల్లాలో మొదటి నుంచి కేసులు తక్కువగానే ఉన్నాయి. కానీ అనూహ్యంగా సోమవారం ఒక్కసారిగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులోనూ ఈ 25 కేసుల్లో 24 కేసులు కేవలం శ్రీకాళహస్తికి చెందిన వారివే కావడం సంచలనంగా మారింది. ఇప్పటికే శ్రీకాళహస్తిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకిన విషయం సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు మరో 24 పాజిటివ్ కేసులు బయటపడటంతో శ్రీకాళహస్తి వాసులు హడలిపోతున్నారు.

 

 

ఇక మిగిలిన కేసు విషయానికి వస్తే.. గత 24 గంటల్లో 3775 మంది శాంపిళ్లకు పరీక్షలు నిర్వహించగా.. 75 మందికి పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్‌ కాగా, 20 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీ వివరాల ప్రకారం అనంతపురంలో కొత్తగా 4, చిత్తూరులో 25, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 20, కడపలో 3, క్రిష్ణాలో 5, కర్నూలులో 16 కేసులు నమోదయ్యాయి.

 

 

నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. 24 గంటల్లో 27 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. గుంటూరులో 15, కృష్ణలో 10, విశాఖపట్నంలో ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు.అనంతపురం, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో కోవిడ్‌తో ఒక్కొక్కరు మరణించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: