భారతదేశం మొత్తాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి రకంగానూ లొంగేలా కనిపించడం లేదు. వారాల తరబడి లాక్ డౌన్ అమలు చేసినా కేసుల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అల్లాడి పోతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం చేసిన పొడిగింపు కు అదనంగా మరొక నాలుగు రోజులు లాక్ డౌన్ ను పొడిగించడం గమనార్హం.

 

 

ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 80 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి ఒకరోజు ఆంధ్రప్రదేశ్ లో ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరికొద్ది రోజుల్లో ఇంకా అధిక మొత్తంలో కేసులు బయటపడడం చూడడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే జగన్ సర్కారు కొరియా నుండి తెచ్చిన లక్ష్య రాపిడ్ టెస్టింగ్ కిట్లను చాలా త్వరగా అనుమానితులు అందరినీ టెస్ట్ చేసే పనిలో ఉన్నారు. రోజున కనిపించిన భారీ లెక్క కూడా దాని చలవే.

 

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 33 వేల మందికి పైగా కరోనా టెస్టులు చేయగా దేశంలోనే అత్యధిక టెస్టులు జరిపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఎక్కువ మందికి టెస్టులు జరపడం ద్వారా చాలా త్వరగా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు బయటపడి ఆరోగ్యవంతులు అంతా సురక్షితం అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు బయటికి వస్తే జగన్ అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. కెసిఆర్ తో పోల్చి అతని పై విమర్శలు గుప్పించిన వారందరికీ జగన్ సరైన ప్రణాళికతో తనేంటో నిరూపించుకుంటూ ఉండగా ఇంకా ఎక్కువ టెస్టింగ్ కిట్లను ఆర్డర్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: