విశాఖ పట్నం.. కరోనా ఏపీలో అడుగుపెట్టిన మొదట్లోనే విశాఖ నగరానికి అతిధిలా వచ్చింది. అక్కడ రెండు మూడు ప్రాంతాల్లో కరోనా ప్రబలిందని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. విశాఖలో కరోనాతో ఓ వృద్దుడు మరణించారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి కూడా. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని ఖండించింది. ఇప్పుడు చూస్తే విశాఖ కంటే ఆలస్యంగా కేసులు మొదలైన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య దూసుకుపోతోంది.

 

 

కానీ అదే విశాఖ నగరంలో మాత్రం కరోనా కేసులు అంతగా పెరగడం లేదు.. అయితే విశాఖపట్నం జిల్లాలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులను ప్రభుత్వం బయటకు రాకుండా తొక్కిపడుతోందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. అంతే కాదు.. తన అనుకూల మీడియాలో వైజాగ్ పై విష ప్రచారం చేయిస్తోందనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నంపై దుష్ప్రచారం చేయాలని ఎల్లో మీడియాకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని, దానికి అనుగుణంగానే ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు.

 

 

విశాఖలో పాజిటివ్ కేసులు తక్కువగా ఉండడంపై లేని పోని అనుమానాలు ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖకు తాజాగా ఐదువేల టెస్ట్ కిట్ లు వచ్చాయని, వాటి ద్వారా ఇక్కడ అధికార యంత్రాంగం పరీక్షలు నిర్వహిస్తుందని విజయసాయిరెడ్డి తెలిపారు. అందులో ఆయా చోట్ల పరీక్షలు జరిపి, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. అధికార యంత్రాంగం విశాఖలో కరోనాను కట్టడి చేయడానికి అన్ని చర్యలు తీసుకుందని విజయసాయిరెడ్డి అన్నారు.

 

 

అయితే విశాఖలో కరోనా కేసులను ప్రభుత్వం దాచి పెడుతోందని టీడీపీ నేతలు ఆరోపించడం దారుణం అనే చెప్పాలి. కరోనా కేసులు దాచి పెడితే దాగేవి కాదు. ఇలాంటి సున్నితమైన అంశం విషయంలోనూ పార్టీ రాజకీయలబ్ది గురించి ఆలోచించడం మానేస్తే మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: