ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ పగ్గాలు చేపట్టి ఏడాది కా కమునుపే ప్రజల్లో మరియు పలు పార్టీల నేతల్లో చాలా మంచి పాలకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా కూడా అతనికి ప్రతిసారి హైకోర్టు నుండి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అది కూడా సరిగ్గా పరిపాలన విషయంలోనే హైకోర్టు జగన్ ను అతని నిర్ణయాలను వెనక్కి తీసుకోమని చాలా సార్లు ఆదేశించిన విషయం ఇప్పుడు వైసిపి పార్టీ వర్గాలకు మింగుడుపడడం లేదు.

 

ఏపీలో స్థానిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క రంగులు విషయం రాజకీయ పరంగా చాలా దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతెందుకు స్థానిక ఎన్నికల ప్రస్తావన రావడానికి చాలా నెలల ముందే కోర్టు వారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు సచివాలయాల పైన పార్టీ రంగులు తొలగించమని ఉత్తర్వులు జారీ చేసింది.

 

కానీ ఎన్నికల సమయానికి కూడా అలానే ఉండడంతో ఆగ్రహించిన కోర్టు వెంటనే పంచాయతీ భవనాలకు వేసిన వైసీపీ తొలగించాలని ఆదేశించింది. అయితే దీనిని తొలగించేందుకు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు వారాల సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది.

 

దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్ట్ రంగులు తొలగించేందుకు మూడు వారాల పాటు ప్రభుత్వం అడిగిన గడువును అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే రంగులు మార్చే వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించరాదని తేల్చి చెప్పింది. కాగా ప్రభుత్వ భవనాలకు రంగులు వేయాలన్న దానిపై ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించాలని కొరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: