ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఎండీ రాధాకృష్ణ.. సాధారణంగా వార్తలు రాసేవాళ్లు వార్తల్లో వ్యక్తులుగా మారడం చాలా తక్కువ. కానీ.. ఏబీఎన్ ఆర్కే వంటి వారు తరచూ వార్తల్లో కనిపిస్తుంటారు. ఎందుకంటే.. ఆయన అడ్డగోలు రాతలు, వ్యాఖ్యానాలు, వ్యాసాలు చదివి తలతిరిగిపోయిన వారు.. వాటిపై విశ్లేషణలు చేయాల్సిన అవసరం ఉందనుకుంటారు. ఆమేరకు కలం కదుపుతుంటారు.

 

 

అందుకే.. ఓవైపు ఆదివారం ఆయన తన పత్రికలో కొత్త పలుకు పేరిట వ్యాసం రాగానే.. దానిపై సమాంతరంగా విశ్లేషణలూ ఊపందుకుంటాయి. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో తనకు ఆజన్మ శత్రుత్వం ఉన్నట్టుగా ఆయన రాతలు కనిపిస్తుంటాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని.. ప్రధానంగా చంద్రబాబును కాపాడేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే అంటూ ఓ నమ్మకమైన బంటు రూపంలో ఆర్కే దర్శనమిస్తుంటారు.

 

 

అయితే అనూహ్యంగా ఈ వారం ఆర్కే జగన్, చంద్రబాబు ఇద్దరికీ ఒకేసారి ఒకే రేంజ్‌లో ఝలక్ ఇచ్చేశారు. అదేమిటంటే.. ఎప్పుడూ ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరిపై నిప్పులు చెరుగుతూనో.. ఆరోపణలు సంధిస్తూనో.. నిలదీస్తూనో.. బురద జల్లుతూనో సాగే ఆర్కే కొత్త పలుకులోఈ వారం ఎందుకో జగన్ పై విమర్శలు పెద్దగా కనిపించనే లేదు. అదే సమయంలో తన అభిమాన నాయకుడు చంద్రబాబు భజన కూడా ఈ వ్యాసంలో కనిపించలేదు.

 

 

ఈ రెండు ఫ్యాక్టర్లూ మిస్సవడంతో అసలు ఇది ఆర్కే రాసిన వ్యాసమేనే .. అంటూ అలవాటైన పాఠకులే కాస్త అనుమానపడాల్సి వచ్చింది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమిటీ..? చంద్రబాబు పేరు లేకుండా కొత్తపలుకు పేరిట వ్యాసం రాయడం ఏమిటీ..? మరీ జగన్ మీద వికృతబాష్యాలతో విరుచుకుపడకపోవడం ఏమిటీ..? అసలు ఏమైందీ తనకు..? కరోనా ప్రభావం ఇలా సమాజంలోని రకరకాల వ్యక్తులపై భిన్నరకాలుగా కనిపిస్తూ ఉంటుందా ఏమిటి..?! అని జనం ఆశ్చర్యపోయేలా కనిపించిందీ తాజా కొత్త పలుకు. కావాలంటే మీరూ చదవి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: