అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అవకాశం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకుని ప్రజలలో పలుకుబడి పెంచుకుంటూ రాజకీయంగా తిరుగులేకుండా ఉంటుంది. లేకపోతే వెనకబడి పోవాల్సిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ వైరస్ ప్రభావానికి గురవుతున్నారు. ఈ సమయంలో ప్రజలకు తాము అండగా ఉన్నామని భరోసా ఇవ్వడంతోపాటు, రాజకీయంగా మైలేజ్ పెంచుకునే అవకాశం వచ్చినా, తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, అలాగే ప్రజల నుంచి విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చక్రం తిప్పిన తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. 
 
 
ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తున్న తమకు ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయారు. అక్కడి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలను అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న తెలుగు తమ్ముళ్లు లో మాత్రం పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాల రాజకీయ జీవితాన్ని అనుభవించి ప్రజలతో మమేకమైన టిడిపి నాయకులు చాలా మంది ఇప్పుడు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సి ఉన్నా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రజలు పార్టీ కార్యకర్తలు ఏమైపోతే మాకేంటి తమకు బాగానే ఉందిగా అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తుండడం విమర్శల పాలవుతోంది. 
 
 
టిడిపి నాయకులు ఎవరు ఇప్పుడు పెద్దగా యాక్టీవ్ గా కనిపించడం లేదు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం విశాఖ లో ఉంటున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అప్పుడప్పుడు విమర్శలు చేసేందుకు మాత్రమే ముందుకు వస్తున్నారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు పరిస్థితి అలాగే ఉంది. లాక్ డౌన్ సమయం నుంచి అమరావతి లోని ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సి ఉన్నా, ఆయన ఆ అవకాశాన్ని బాధ్యతను వినియోగించుకోలేకపోతున్నారు. ఇలా ఎక్కడ చూసినా తెలుగు తమ్ముళ్లలో నిస్తేజం అలుముకుంది. కేవలం ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగిన వారు మాత్రమే అడపదడప ప్రజలు తిరుగుతూ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప పెద్ద పెద్ద పదవులు సంపాదించుకున్న ఏ ఒక్క నేత ముందుకు రాకపోవడంతో మిగతా తెలుగు తమ్ముళ్లు మరింత నీరసం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: