నిజానికి మనము వివిధ పండ్లను తింటూ ఉంటాము వాటితో జ్యూస్ తాగుతూ ఉంటాం. కానీ కొంతమందికి అందులో ఎలాంటి పోషకాలు లభిస్తాయి దాన్ని తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు పొందుతాము ఎంత శక్తిని పొందుతామని విషయాలు ఎక్కువగా తెలిసి ఉండవు. ఇక ఈ వేసవిలో బాగా లభించే పండ్లలో సపోటా పండు కూడా ఒకటి. దీన్ని తినడం వల్ల రకరకాల అనారోగ్యాలు నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఇందులో అనేక విటమిన్లు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. ఈ పండ్లలో ముఖ్యంగా కాపర్, ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ ఇలా కొన్ని లభిస్తాయి. అలాగే ఇందులో ఉండే కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మనలో ఉండే గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది.

 


ఈ సపోటా తినడం, జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా సపోటా జ్యూస్ లో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగు పడ్డాయి కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు ఇది నివారిస్తుంది. సపోటా తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనం చేకూరుతుంది అంతేకాకుండా పెరిగే పిల్లలకు మంచి బలాన్ని కూడా ఇస్తుంది. నిజానికి సపోటాలో ఉండే ఫ్రక్టోస్ వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందించగలదు.

 


సపోటా జ్యూస్ తాగడం వల్ల అందులోని క్యాల్షియంతో మనం ఎముకలను బలాన్ని చేకూరుస్తుంది. నిజానికి ఇది మన నాడీ వ్యవస్థను కాస్త సంత పరిచి ఒత్తిడిని తగ్గించగలుగుతుంది. అలాగే విరామం C అధికంగా ఉండటం వల్ల శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీనితో మనము ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని మనకు అందజేస్తుంది. ముఖ్యంగా సపోటా జ్యూస్ తాగడం వల్ల తలలో రక్త సరఫరా మెరుగుపడుతుంది అంతేకాకుండా జుట్టు బలంగా పెరుగుతుంది. ఇది కొంతవరకు తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా హానికరమైన ఫ్రీరాడికల్స్ ని ఇది నివారిస్తుంది. అంతేకాకుండా దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోని వేడిని చాలావరకు నియంత్రిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: