ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఇంట్లో ఉండి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. వ్యాపారంలో బిజీ బిజీగా ఉండి కుటుంబంతో సమయం గడప లేకుండా ఉన్న వారు ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నారూ . ఇక ఉద్యోగులందరూ రోజు ఆఫీస్ కి వెళ్లాలా... ఇంట్లో ఉండే పని చేసుకుంటే ఎంత బాగుండు అనుకునేవారు అందరూ వర్క్ ఫ్రొం హోమ్ అని ఇంటినుంచే పనిచేస్తున్నారు. ఇలా అందరూ బాగానే ఉన్నారు... కానీ లాక్ డౌన్  సమయంలో బాధ పడుతున్నది  మందుబాబులు మాత్రమే. అందరూ ఎలా ఉన్నప్పటికీ మందుబాబుల పరిస్థితి మాటల్లో చెప్పలేనంత దారుణంగా . రోజు ఒక పెగ్ వేస్తే  గాని బ్రెయిన్ పని చేయని మందుబాబులు ప్రస్తుతం ఆ పెగ్గు  కాస్తా దొరకకపోవడంతో పిచ్చివాళ్ళలా మారిపోతున్నారు. 

 

 

దీంతో  మందు కావాలి మహాప్రభో అని వేడుకుంటున్నారు. అయితే లాక్ డౌన్  సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే... లేదా ఏదైనా సలహాలు కావాలంటే  ప్రజలు పలు వివరాలు తెలుసుకునేందుకు 108 కి  ఫోన్ నెంబర్ ను అధికారులు అందుబాటులో ఉంచిన విషయం. అయితే ఈ నెంబర్కు ఫోన్ చేస్తున్న వారు వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి అంటే దాదాపుగా 80% మంది మందు  కావాలి..మహాప్రభో  మద్యం షాపులు తెరవండి మీకు రుణపడి ఉంటాం అంటూ అధికారులని కోరుతున్న వారు ఎక్కువగా ఉన్నారట. మందు లేకపోతే పిచ్చెక్కిపోతుంది అర్జెంట్గా దుకాణాలు తెరిపించండి అంటున్నారట. అంతేనా అక్కడక్కడా కొంతమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు.  కొంతమంది వింతవింతగా ప్రవర్తిస్తున్న వారు  కూడా ఉన్నారు. 

 

 అయితే ప్రతి రోజూ మద్యం తాగే అలవాటున్న వారు మూడు వారాలకు పైగా మద్యం  తీసుకోకపోతే ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రస్తుతం కరోనా  వైరస్ నియంత్రణపై దృష్టి సారించిన నేపథ్యంలో ప్రస్తుతం మందుబాబుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మందుబాబులు 108 నెంబర్ కి కాల్ చేసి మద్యం షాపుల తెలవారని అభ్యర్థిస్తూ ఉంటే మందుబాబులు వారికి ఏం సమాధానం చెప్పాలి అనేది కూడా అర్థం కావడం లేదు అంటున్నారు. చూడాలి మరి మందుబాబుల కోరిక ఎప్పుడు తీరుతుందో అని.

మరింత సమాచారం తెలుసుకోండి: