క‌రోనా పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ట్ర‌ ఫ‌స్ట్ ప్లేసులో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. దేశ ప్ర‌జ‌లంద‌రూ విస్తుపోయే ఓ దిక్కుమాలిన నిర్ణ‌యానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మొగ్గుచూప‌డం గ‌మ‌నార్హం.  సోషల్ డిస్టాన్స్ కచ్చితంగా పాటిస్తామంటే... వైన్ షాపులు తెరిచేందుకు అనుమతిస్తామంటూ  రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే... ఓ సంచలన ప్రకటన చేయ‌డం గ‌మ‌నార్హం. స‌ద‌రు మంత్రిగారి ప్ర‌క‌ట‌న‌తో మందుబాబులు ఖుషీ అవుతున్నా మిగ‌తా జ‌నం మాత్రం భ‌యాందోళ‌న చెందుతున్నారు. తాగక ముందే లాక్‌డౌన్ పాటించ‌ని జ‌నాల‌ను...తాగ‌కా ఎలా కంట్రోల్ చేస్తారంటూ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.  అయితే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోక‌పోయిన‌ప్ప‌టికి, ఇప్ప‌ట్లో ఆ ఆలోచ‌నే మానుకోవాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు హితవు ప‌లుకుతున్నారు. 

 

మేఘాలయ, అసోం లాంటి రాష్ట్రాలు ఇప్పటికే మద్యం అమ్మకాలకు అనుమతించాయి. ఢిల్లీ ప్రభుత్వం ఇవాళో, రేపో ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.ఈ నేప‌థ్యంలో మంత్రిగారి నోట మ‌ద్యం షాపులు తెర‌వ‌డానికి సూచ‌న‌ప్రాయంగా ఓకే అన్న‌ మాట వినగానే... లిక్కర్ లవర్స్‌ చల్లటి బీర్ నోట్లో పోసుకున్నట్లు ఫీలై ఖుషీ అయిపోతున్నారు. "మీరు కేక సార్‌" అంటూ తెగ మెచ్చేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. మంత్రి మాట మాత్రంగా చెప్పిన ఇందుకు సంబంధించిన ఇంకా ప్ర‌క్రియ ఏదీ చ‌ర్చ‌కు రాన‌ట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం మద్యం షాపులు తెరిచేందుకు సంబంధించి ఇంకా ఏ నోటిఫికేషనూ జారీ చెయ్యలేదు. వెంటనే మీడియా ప్రశ్నిస్తే... ఆ మంత్రిగారు... "వస్తుంది... త్వరలోనే ప్రభుత్వ ప్రకటన వస్తుంది" అన్నారు.

 

ఇదిలా ఉండ‌గా మ‌ద్యం దుకాణాలు బంద్ కావ‌డంతో అటు ప్ర‌భుత్వాల ఆదాయానికి భారీగా గండిప‌డుతోంది. దీంతో ఖ‌జ‌నా వ‌ట్టిపోతోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికైతే అతిపెద్ద ఆదాయం అదేన‌ని చెప్పాలి. మహారాష్ట్రలో మద్యం షాపులు మూతపడటంతో... ప్రభుత్వానికి వచ్చే రాబడి పడిపోయింది. వేల మంది ఉద్యోగులు... ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం... హాట్‌స్పాట్లు కాని ప్రదేశాల్లో దశల వారీగా మద్యం షాపులకు అనుమతించాల‌ని మహారాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. అంటే... మే 15 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకూ తెరచుకోనిస్తారని తెలిసింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: