కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనాతో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన దేశాల్లో అమెరికా, ఇట‌లీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, చైనా దేశాలున్నాయి. అయితే అగ్ర‌రాజ్యంలో ప‌రిస్థితి ఇంకా అదుపులోకి రావ‌డం లేదు. ఇక ఇట‌లీలో మాత్రం తాజా గ‌ణాంకాలు ఆశాజ‌నకంగా ఉండ‌టం విశేషం.  సోమవారం ఇటలీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కాస్త తక్కువగా నమోదైన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించిన వివ‌రాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఫ్రెంచ్ సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ తెలిపిన ప్రకారం 1,08,237 మంది కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

అలాగే సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ హెడ్ ఏంజెలో బోరెల్లి మాట్లాడుతూ మొదటిసారి సానుకూల సంకేతం వచ్చిందని, కరోనా సోకిన వారి సంఖ్య తగ్గిందని వెల్లడించారు. కోవిడ్ -19 కారణంగా ఇటలీలో ఇప్పటివరకు 23,660 మంది మరణించార‌ని త‌న నివేదిక‌లో పేర్కొంది.  ఇక  స్పెయిన్ లో 2,00,210 మందికి వ్యాధి సోకిన‌ట్లు వెల్ల‌డించింది. అయితే స్పెయిన్‌లో వ్యాధిసోకిన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు  20,852 మంది మరణించ‌డం బాధాకారం. ఇక యూకేలో కూడా మ‌ర‌ణాల సంఖ్య భారీగా న‌మోదవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 16,060 మంది ప్రాణాలు విడిచారు. 1,20,067 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డం గ‌మ‌నార్హం. 


ఇదిలా ఉండ‌గా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1540 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 17,656కు చేరుకోగా మృతుల సంఖ్య 559కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. అయితే అత్యధికంగా మహారాష్ట్రలో 4203 మంది కరోనా బారిన పడ్డారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే 223 మంది ప్రాణాలు కోల్పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మే మొదటి వారంలో కరోనా వైరస్ ప్రభావం భారత్‌లో గరిష్టానికి చేరుకుంటుందని.. తర్వాత తగ్గుముఖం పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 14,255 యాక్టివ్ కేసులు ఉండగా.. 77 మంది విదేశీయులు కూడా కోవిడ్ బారిన పడ్డార‌ని తెలిపింది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: