కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎన్నో విధాలుగా నష్టపోతున్నాయి. ఈ కరోనా వైరస్ చైనా ప్రయోగశాల నుంచి వచ్చింది కావున ప్రపంచంలో జరుగుతున్న ఈ తీవ్ర పరిణామాల కు చైనానే బాధ్యత తీసుకోవాలని ట్రంప్ చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే చైనా అమెరికాకు మంచి గట్టి సమాధానాన్ని అందించింది. దీనిపై బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం అమెరికా మానుకోవాలని చైనా తెలియజేసింది.  చైనా విదేశాంగ శాఖకు చెందిన ప్రతినిధి జంగ్ షువాంగ్ ఇవాళ మీడియాతో మాట్లాడాడు.

 

వాస్తవాలను మరియు సైన్స్ ను గౌరవించాలని  అన్నారు ఇలాంటి బాధ్యతారహితమైన మాటలు తమకు తగినవి కాదు అని అన్నాడు. వైరస్ దాడిలో చైనా కూడా బాధిత దేశమే అని ఇతర దేశాలను పీడించి నట్లే మమ్మల్ని కూడా పీడించింది. వైరస్ కట్టడి కోసం పారదర్శకంగా చైనా పని చేస్తోందన్నారు. మహమ్మారిని అదుపు చేసేందుకు తాము ఎన్నో త్యాగాలు చేశామన్నారు. ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు అన్నీ కలసి పని చేయాలి  కానీ ఒకరిపై ఒకరు నిందలు వేయడం సరి కాదన్నాడు.

 

 ట్రంపు చేసిన హెచ్చరికల తీరును తప్పు పట్టిన చైనా. గతంలో అమెరికా నుండి ప్రబలిన ఎన్నో వ్యాధుల కారణంగా కలిగిన  సంక్షోభంకు  సంబంధించిన బాధ్యతలను అమెరికా తీసుకుందా అని చైనా ప్రశ్నించింది.  2019లో హెచ్1ఎన్ 1 ఫ్లూ అమెరికాలో ప్రబలింది, అదేవిధంగా 1980 దశకంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అమెరికా నుంచి వ్యాపించింది మరియు 2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటి సంఘటనలకు మరియు  వాటికి సంబంధించిన దుష్పరిణామాలకు అమెరికా బాధ్యత వహించిందా ..అని  చైనా ప్రశ్నించింది. వైరస్ వల్ల కలిగిన నష్టానికి చైనానే నష్టపరిహారం చెల్లించాలన్న అమెరికా వాదనను డ్రాగన్ దేశం ఈ రకంగా కొట్టిపారేసింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: