కరోనా వచ్చి కొందరు చస్తుంటే.. మరికొందరు మాత్రం ఇదే అదనుగా సైబర్ నేరాలకు పాలపడుతున్నారు.. ముఖ్యంగా ఈ కరోనా కలంలో ఎలా బ్రతుకాలో ఆలోచించే వారికంటే.. ఎంతలా సుఖపడుతున్నామో అని ఆలోచించే వారే ఎక్కువగా ఉన్నట్టున్నారు.. అందుకే రికార్డ్ స్దాయిలో గర్భనిరోధక సాధనాలు అమ్ముడు పోయావని, మొన్నామధ్య ఒక సర్వే తెలిపింది.. ఇక మనిషికి ఉన్న ఈ వీక్ పాయింట్‌ను క్యాష్ చేసుకోవడానికి దొంగల మూఠా రెడిగా ఉంది.. ఇక లాక్‌డౌన్ వేళల్లో జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచించే వారికోసం ఒక స్కీం రెడిగా ఉంచారు సైబర్ నేరగాళ్లు..

 

 

ఈ ప్రణాళికతో రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. అదీగాక ఆన్ లైన్ లో మద్యం సరఫరా చేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.3 లక్షలకుపైగా టోకారా వేసిన సంగతి తెలిసిందే.. ఈ దారిలోనే తాజాగా మరో మోసానికి ఒడిగట్టారు ఈ నేరగాళ్లూ. కానీ ఈసారి అమ్మాయిల వీక్ నెస్ ఉన్న వ్యక్తిని దగా చేశారు. అదెలా అంటే.. మీకు అమ్మాయి కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. గంటలో అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది అంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టుపెట్టారు. ఇంకేముంది, ఈగలకు బెల్లం దొరికితే ఊరుకుంటాయా.. ఇలాగే హైదరాబాద్ లోని బొల్లారం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కక్కుర్తి పడి వెంటనే ఆ నెంబర్ కు మెసేజ్ చేశాడు.

 

 

బక్ర దొరికిందని సంతోషించిన ఆ కేటుగాళ్లూ ఇతన్ని మాటల్లో పెట్టి రూ.91వేలు సంకనాకించారు.. ఆ డబ్బులు అకౌంట్ లో జమకాగానే సైబర్ నేరగాళ్లు తమ మొబైల్ నెంబర్ ను బ్లాక్ చేశారు. అప్పటికి కాని ఆ వ్యక్తిలో ఉన్న కామం పూర్తిగా నశించి నిజాన్ని గ్రహించాడు.. ఈ దరిద్రుడు ఇలా చిత్తకార్తి కుక్కలా ప్రవర్తించకుండా అన్ని డబ్బులు చేతిలో ఉంటే కరోనా వల్ల ఎందరో ఆకలికి అలమటిస్తున్నారు.. కనీసం అలాంటి వారికైన సహాయం చేస్తే బాగుండు.. కాని ఇలాంటి పనులు చేయరు.. ముండల కోసం పెట్టమంటే మాత్రం ముందుంటారని అనుకుంటున్నారు నెటిజన్స్..

 

 

ఇక ఈ విషయాన్ని సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు... ఇలాంటి కేసులు ఇప్పటికే కుప్పలుగా మూలుగుతున్నాయి.. అందులో కరోనా సమయంలో ఈ కేసు తేలినట్టే.. వీడి డబ్బులు వచ్చినట్లే.. అయినా గాని ఇలాంటి తింగరి నాయళ్లకు ఎన్ని సార్లు పోలీసులు  ఆన్‌లైన్ కేటుగాళ్ల ఉచ్చులో ప‌డ‌కుండా ఉండాలని నెత్తీనోరు బాదుకుంటు చేప్పినా వినిపించుకోరు.. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండగలరని మరోసారి విన్నవిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: