ఒకప్పుడు గురువులు విద్యార్థలకు ఆరు బయట చెట్టు కింద ప్రకృతి వడిలో పాఠాలు భోదించే వారు.  రాను రాను పాఠశాల గదుల్లో బోర్డుపై పాఠాల గురించి చెబుతూ బోధించడం మొదలు పెట్టారు.  టెక్నాలజీ డెవెలప్ అయ్యాక.. ఆన్ లైన్ పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు.  తాజాగా దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో పాఠశాలు, కళాశాలలు అన్నీ మూసి వేశారు. దాంతో చాలా మంది ఆన్ లైన్ పద్దతుల్లో పాఠాలు బోధిస్తున్నారు.  కానీ ఓ హిస్టరీ మాస్టర్ తన విద్యార్థుల కోసం ఏకంగా చెట్టెక్కి మరీ పాఠాలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

 

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ లోని బాంకురా జిల్లా అహందా గ్రామానికి చెందిన సుబ్రతాపాటి (35) కోల్ కత్తాలోని రెండు విద్యాసంస్థల్లో హిస్టరీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.  లాక్ డౌన్ కారణంగా ఆయన స్వస్థలం వెళ్లారు.. కానీ అక్కడ నెట్ వర్క్ సరిగా పనిచేయడం లేదు. సెల్ పోన్ కు సిగ్నల్ అంతంత మాత్రమే అందడంతో ఇంటర్ నెట్ పని చేయలేదు. కానీ అతడు ఆన్ లైన్ లో విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రారంభించాడు.

 

దాంతో తన ఇంటి ముందు ఉన్న వేప చెట్టుపై ఓ చిన్నపాటి నివాసం లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి పిల్లలకు  పాఠాలు బోధించడం ప్రారంభించారు. ఉదయాన్నే భోజనం, నీళ్లు తీసుకుని చెట్టుపైకి ఎక్కుతానని ఉపాధ్యాయుడు సుబ్రతాపాటి చెప్పారు. చెట్టుపై ఎలాంటి అంతరాయం లేకుండా సిగ్నల్ వస్తోందని తెలిపారు. ఆన్ లైన్ లో ప్రతిరోజూ  2 నుంచి 3 తరగుతులు బోధిస్తానని తెలిపారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: