గూగుల్ పే కస్టమర్ల అందరికీ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ అందరికీ శుభ వార్త తెలియజేస్తుంది. గూగుల్ సంస్థ తాజాగా స్మార్ట్ పేమెంట్ కార్డ్ బిజినెస్ లోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యింది. అతి త్వరలోనే డెబిట్ కార్డ్ లు లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇక ఇదీ విషయం తో యాపిల్, హువావే కంపెనీలకు గట్టి పోటీనే ఇస్తుందనే చెప్పాలి. అలాగే గూగుల్ ఫిజికల్ పేమెంట్ కార్డు కూడా కస్టమర్లకు ఇవ్వడానికి నివేదికలు తెలియజేస్తుంది.

 

 

దీనికి పేరు గూగుల్ కార్డ్, గూగుల్ పే కార్డ్ అనే పేరు పెట్టాలని. కాకుండా యాపిల్ కార్డ్ లాగా గూగుల్ కార్డ్ డెబిట్ కార్డ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాస్తవానికి యాపిల్ కార్డ్ అనేది క్రెడిట్ కార్డు. కానీ గూగుల్ డెబిట్ కార్డు పో బ్రాండెడ్ కార్డు కావచ్చు అని అంచనాలు వేస్తున్నారు.  అంటే ఈ గూగుల్ డెబిట్ కార్డ్ కోసం సిటీ బ్యాంకు వంటి పలు బ్యాంకులు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా గూగుల్ డెబిట్ కార్డులు వీసా చూపుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని సంస్థ సిద్ధమవుతుంది. ఆ తర్వాత మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డు అందుబాటులోకి తీసుకొని రావాలని సన్నాహాలు చేస్తుంది.

 


అంతేకాకుండా గూగుల్ పేమెంట్స్ ద్వారానే గూగుల్ పే ద్వారా కూడా ఈ డెబిట్ కార్డు ఉపయోగించుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక ఈ పేమెంట్స్ కార్డ్ ని ఎప్పుడు మార్కెట్లోకి అమలులోకి తీసుకొని వస్తుందన్న విషయం పై ఎటువంటి క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం గూగుల్ పే ఆన్లైన్, పీ టు పీ ట్రాన్సాక్షన్ సర్వీసులు చేస్తుంది. దీనికే పేమెంట్ కార్డ్ లింకు కూడా చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటికే గూగుల్ పే యూజర్లు భారత్‌ లో చాలా మంది ఉన్నారు. ఈ యాప్ అనతి కాలంలోనే గూగుల్ పే చాలా మందికి దగ్గర అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: