షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్...! వాటర్ బాటిల్ కంటే.. క్రూడ్ ఆయిల్ ధర తక్కువ..! అవును కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుప్పకూల్చేసింది. దీంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా అమెరికాలో క్రూడ్ ఆయిల్ ధర మైనస్‌ల్లోకి పడిపోయింది. లాక్‌డౌన్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉన్న నిల్వలలను ఎలా అమ్ముకోవాలో అర్ధంకాక ఆయిల్ కంపెనీలు తలపట్టుకున్నాయి.

 

బహుశా చరిత్రలో ఎప్పుడూ ఇంధన రంగం ఈ స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొని ఉండదు.  కరోనాను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉండటంతో ఆయిల్ వినియోగం ఎప్పుడూ లేని స్థాయిలో పడిపోయింది. దీంతో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ లేకుండా పోయింది. లాక్‌డౌన్ కారణంగా ముడి చమురు నిల్వలు పేరుకుపోవడం- డిమాండ్ -సప్లై చెయిన్ కు బ్రేక్ రావడంతో క్రూడ్ ఆయిల్ మార్కెట్లు షేక్ అయిపోతున్నాయి.

 

అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర మైనస్ డాలర్లలోకి వెళ్లిపోయింది. అంటే అమ్మేవాళ్లు ఉన్నారు గానీ కొనే నాథుడే లేడు.. అమెరికా మార్కెట్లను ఇంధని సూచీలు షేక్ చేశాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్.. మైనస్ 37.63 వద్ద ముగిసింది. నిన్న ఒక్కరోజే బ్యారెల్ ధర 90 శాతం పడిపోయింది. అమెరికా ఆయిల్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్ కొనసాగించడంతో మే నెలకు సంబంధించిన ఆయిల్ ఒప్పందాలను చాలా దేశాలు రద్దు చేసుకున్నాయి. దీంతో ఇంధన ఉత్పత్తి దారులపై ఒత్తిడి పెరిగిపోయింది.

 

పెట్రోలియం ఎగుమతి దేశాల సమాక్య ఇంధన యుద్ధానికి తోడు...కోవిడ్ 19 రాజేసిన చిచ్చు ఆయిల్ మార్కెట్లలో మంటపెట్టింది. వినియోగం తగ్గడంతో ఇంధన నిల్వలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉన్న నిల్వలలను ఖాళీ చేస్తే తప్ప కొత్తగా ఉత్పత్తి చేయడం సాధ్యపడతుంది.. అమెరికాకు ఆయిల్ హబ్‌గా చెప్పుకునే ఒక్లహోమాలో ఇంధన నిల్వలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో చమురు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. సౌదీ అరేబియా, రష్యాతో పాటు ఇతర ఇంధన ఉత్పత్తి దేశాలు వచ్చే రెండు నెలల పాటు రోజుకు 9.7 మిలియన్ బ్యారెట్ల ఇంధనాన్ని మాత్రమే ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: