ప్రస్తుతం విజయవాడలో కరోనా వైరస్ బాగానే వ్యాప్తి చెందుతుంది అని చెప్పవచ్చు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఎప్పుడూ రద్దీగా ఉండే విజయవాడ సిటీ ఇప్పుడు మాత్రం చాలా ఖాళీగా ఉంది. అయితే కొన్ని వాహనాలు మాత్రం రోడ్డుమీదికి అలా వచ్చేస్తున్నాయి. ఇంట్లో ఉండడానికి బోర్ కొట్టి బయటకు వస్తున్నారో లేక ఏదైనా పనిమీద బయటికి వస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. లాక్ డౌన్ ని ఎవరైతే ఆక్రమిస్తారో వారికి ఎప్పుడు లాగా ఫైన్ వేయడం ఆపేసి కొత్త పద్ధతిని విజయవాడ పోలీసులు మొదలుపెట్టారు.

 


ఇక అసలు విషయానికి వస్తే... ఎవరైతే లాక్ డౌన్ బ్రేక్ చేస్తారో వాళ్ళకి బ్రేక్ లేకుండా పని ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినట్లు తెలియడంతో పోలీస్ అధికారులు ఆ విషయాన్ని మరింత టైట్ చేశారు. అయితే అదే సమయంలో ఒక ఇంట్లో ఉన్న వ్యక్తి హడావిడిగా రోడ్డుపైకి వచ్చాడు. అంతే స్టాప్... స్టాప్... అంటూ పోలీసులు అతని ఆపారు. ఆ వ్యక్తి మహా అయితే ఫైన్ వేస్తారు అంతే కదా కట్టేసి వెళ్తాను అని అనుకున్నాడు పాపం. నిజానికి ఇలా చాలా మంది ఫైన్ కట్టమంటే ఈజీగా కట్టి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం దీనితో వదలకుండా పోలీసులు కొత్తగా ఆలోచించి పాత ఫార్ములానే ఇక్కడ ప్రయోగించారు. 

 


అదేమిటంటే సదరు వ్యక్తిని పిలిపించి అతనికి రెండు వైట్ పేపర్లు ఇచ్చి పెన్ ఇచ్చారు. అంతే సదరు వ్యక్తి ఏంటి సార్ దీనిపైన ఏదైనా రాసి ప్లకార్డ్ పట్టుకొని రోడ్డుపై నిలబడాలా అని అడిగితే అలాంటిది ఏమీ అవసరం లేదు, నిన్ను అంత ఎందుకు కష్టపడతాం... సింపుల్ గా ఈ పేపర్ పై తప్పు అయిపోయింది క్షమించండి అని కేవలం 500 సార్లు రాసి అప్పుడు వెళ్ళు అని అన్నారు. ఇక అంతే ఆ మాట వినగానే సదరు వ్యక్తికి గొంతులో గుటకలు రావడంతో పాటు, ప్రాణం పోయినంత ఫీలింగ్ వచ్చింది. ఏదిఏమైనా పోలీసుల ప్లాన్ సూపర్ అబ్బా...!

మరింత సమాచారం తెలుసుకోండి: