క‌రోనా రోగుల‌కు వైద్యం అందించేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌లో వ‌స‌తులు సూప‌ర్ అంటున్నారు వైద్యులు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దిన విష‌యం తెలిసిందే. రాష్ట్రానికే మణిహారంగా ఉండేలా ముఖ్యమంత్రి దీనికి 'టిమ్స్' (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అని పేరు పెట్టిన విష‌యం విదిత‌మే.  దీనికి లాంఛనంగా మంగళవారం ప్రారంభోత్సవం కూడా జరిగింది. అత్యాధునికంగా ఉన్న భ‌వ‌నంలోని వ‌స‌తులు వైద్యుల‌కు, రోగుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. బుధ‌వారం నుంచి ఇక్క‌డ క‌రోనా వ్యాధిగ్ర‌స్థుల‌కు, క్వారంటైన్‌కు త‌ర‌లించే వారిని ఇక్క‌డ‌కే తీసుకురానున్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. 


ఈ మేర‌కు సోమ‌వారం వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కూడా ఒక ప్ర‌క‌ట‌న‌లో ధ్రువీక‌రించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఉస్మానియా, గాంధీ ఆస్ప‌త్రుల్లో క‌రోనా బాధితుల‌కు వైద్యం అంద‌జేస్తున్నారు. ఈరెండు ఆసుప‌త్రుల‌కు అనుబంధంగా టిమ్స్‌లో కూడా వైద్య సేవ‌లు అంద‌నున్నాయి. అయితే ఉస్మానియాకు అనుబంధంగా ఉంటుంద‌ని, దాని ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఈ ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఇకపై కరోనా అనుమానిత కేసులను ఐసొలేషన్‌లో ఉంచేందుకు ఉపయోగపడనుంది. ఇప్ప‌టికే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నుంచి కొన్ని వైద్య పరికరాలను, సిబ్బందిని తరలించే ప్రక్రియ ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం. 

 

టిమ్స్‌ 14 అంతస్తుల  భవనంలో 540 గదులుంటాయి.  మొత్తం1500 పడకలతో ఐసోలేషన్ కేంద్రంగా, 50 పడకలతో అత్యవసర చికిత్స విభాగాలను తీర్చిదిద్దారు. బుధవారం నుంచి ఈ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేయనున్నట్లు టిమ్స్ సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు విలేఖ‌రుల‌కు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగుల్లో కరోనా అనుమానితులు ఉన్నట్లయితే అక్కడ ఉంచుకోకుండా వెంటనే గచ్చిబౌలికి తరలిస్తామని వారు పేర్కొన్నారు. కరోనా పూర్తిగా స‌ద్దుమ‌ణిగాక ఉస్మానియా తరహాలో టిమ్స్ ఆస్ప‌త్రి కూడా  కొత్త హంగులను సమకూర్చుకుంటుంద‌ని వెల్ల‌డించారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: