ప్రస్తుత రోజుల్లో దొంగ బాబాలు బాగా పెరిగిపోతున్నారు. అయితే ఒక బాబా చెప్పాడని కన్న కూతురునే చంపమని సలహా ఇచ్చాడు ఓ దొంగ బాబా.. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి...! ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని అటవీప్రాంతం ఆ ఏరియా. అక్కడ ఒక ముసలాయన పైన వెళ్తున్న గద్దల వైపు గర్వంగా చూస్తూ జరిగింది అదే జరిగింది అంటూ కేకలు వేసాడు. అక్కడ ఉన్న స్థానికులు ఏమైంది ముసలోడా ఏదో అంటున్నావ్ అనగానే మళ్ళీ ముసలాయన ఆకాశంవైపు తన చూపును మళ్ళించి లేని శక్తి తెచ్చుకుంటూ... శవం తేలింది అని అంటున్నాడు. అక్కడ పక్కన ఉన్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం ప్రశ్నించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారు.

 

 

అప్పుడు ఆ ముసలాయన వాళ్లకు సమాధానం ఇస్తూ ఏదైనా జంతువు చచ్చిపోతే అప్పుడు గద్దలు ఇలాగే ఎగురుతాయి కదా అని అన్నాడు. అంతే పైన గద్దలు అన్ని తిరుగుతున్న ప్రదేశానికి ప్రజల దగ్గరకు వెళ్లగా అక్కడ ఏదో తేడాగా కనిపించగా ఎవరో మట్టిని తవ్వి మళ్లీ పూచినట్లు .. అక్కడ స్థానికులకు కనిపించింది. ప్రస్తుతం మనం చేసే పని ఏముంది మనం చేసేదేముంది అంటూ వెంటనే చుట్టుపక్కల ఎండు కర్రలు విడగొట్టి వాటిని గడ్డపార లాగా చేసుకుని అక్కడ తవ్వడం మొదలు పెట్టారు. ఇలా కొద్దిసేపు తొలగిన తర్వాత ఏదో తగిలినట్లు అనిపించి ఏమిటా అని చూశారు. ఇంకేముంది ఓ కాలి మెత్తని వేళ్లు వాళ్ల చేతులకు తగలడంతో అంతే ఇక అప్పుడు స్థానికులకు అర్థమయింది ఇది జంతువు కాదు మనిషి అని. ఇక ఆ వెంటనే తవ్వడం ఆపేసి పోలీసులకు ఫోన్ చేశారు.  

 

ఆ తర్వాత స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి వారి సమక్షంలో తవ్వకాలు జరిగాయి. చిన్న పాప ఆ పాపకు రెండు సంవత్సరాలు ఉంటాయి. ఆ రోజే చనిపోయినట్లు కూడా అర్థమవుతుంది. ఆ పాపను చూడగానే వెంటనే స్థానికులల్లోని ఒక కుర్రాడు పోలీసులతో ఏదో చెప్పాడు అంతే.. ఇంకేముంది పోలీసులు హడావిడిగా ఊళ్లోకి వెళ్లారు. ఊర్లో ఒక ఇంటి తలుపు తీసి ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పోలీసులను చూడగానే అతని చేతిలో ఉన్న బీడీ కిందకి పడేయడంతో పోలీసులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లాటి కర్రలతో  ఆ వ్యక్తిని చితకబాదారు. అంతలోనే ఆ వ్యక్తి కొట్టొద్దు అండి సార్.. అంటూ ఒక కథ తెలియజేశాడు పోలీసులకు. 

 


తాను ఏళ్లుగా పేదరికంలో ఉన్న తన తలరాత మారాలని అద్భుత శక్తులు రావాలంటే... పాపను అమావాశ్య నాడు అదృశ్య శక్తులకు బలి ఇవ్వాలని, స్థానికబాబా చెప్పినట్లు ఆయన వివరించాడు. అయితే ఆ పాపని ఎలా చంపాలో తానే చెబుతానని అనడంతో తన కూతుర్ని చంపేందుకు సిద్దపడి చంపేశాడట..

మరింత సమాచారం తెలుసుకోండి: