దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిస్థాయిలో కరోనాను నియంత్రించలేకపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలో కొందరు తమకు ఇష్టమైన పనులు చేస్తూ గడుపుతుంటే.... మరికొందరు లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తున్నారు. 
 
మరి సాధారణ ప్రజలే బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతోంటే లాక్ డౌన్ లో ఉన్నవారి పరిస్థితేంటి..? అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే కరోనా రోగులు తమ బెడ్లపై డ్యాన్స్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అయింది. పంజాబ్ లోని జలంధర్ ప్రాంతానికి చెందిన కరోనా రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోగులకు ఏ మాత్రం బోరు కొట్టకుండా అధికారులు వారికి టీవీలను ఏర్పాటు చేశారు. 
 
రోగులు టీవీలో పంజాబీ పాటలు పెట్టుకుని ఐసోలేషన్ వార్డులో డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ అవ్వడంతో ఆస్పత్రి ఉన్నతాధికారి స్పందిస్తూ కరోనా రోగులు ఎవరి బెడ్లపై వారు ఉండి డ్యాన్స్ చేశారని... రోగులు సామాజిక దూరం పాటించారని చెప్పారు. నెటిజన్లు వైరల్ అవుతున్న ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 873కు చేరగా ఏపీలో ఈరోజు నమోదైన కేసులతో కలిపి 757కు చేరింది. రాష్ట్రంలో ఈరోజు 35 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 96 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 22 మంది మరణించారు. ప్రస్తుతం 639 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: