క‌రోనా ప్ర‌పంచానికి స‌వాల్ విసురుతూ రోజూ వేలాదిమంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. ఈ మ‌హమ్మారికి ఇప్ప‌టి వ‌ర‌కు మందు లేక‌పోవ‌డంతో నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ ప్ర‌జ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. భూ మండ‌లంపై ఉన్న అన్ని దేశాల్లో ఈ ర‌క్క‌సి అడుగుపెట్టేసింది. వైద్యుల‌కు కూడా అంతుచిక్క‌ని విధంగా రోజుకో కొత్త ల‌క్ష‌ణాన్ని బ‌య‌ట‌పెడుతోంది. క‌రోనాపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న వైద్యుల‌కు, శాస్త్ర‌వేత్త‌ల‌కు స‌రికొత్త‌గా విస్తుగొలిపే విష‌యాలు తెలుస్తూను ఉన్నాయి. మొద‌టి కేవ‌లం నాలుగు అడుగులు మాత్ర‌మే గాలిలో ప్ర‌యాణం చేస్తుంద‌నుకున్న వైర‌స్ ఇప్పుడు 13అడుగుల వ‌ర‌కు కూడా ప్ర‌యాణి స్తున్న‌ట్లుగా ఆధార పూరితంగా శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు.  


క‌రోనా  వైరస్‌ను అడ్డుకోవడానికి ఎన్నో క‌ఠిన‌మైన‌ చర్యలు తీసుకుంటూ, నివారణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ వైరస్ భీకరంగా వ్యాపిస్తూనే ఉంది. ఇకపోతే ఈ వైరస్ కి సంబంధించి మనందరిలో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఎవరైనా చనిపోతే, ఆ మృతదేహానికి ఎలాంటి అంత్యక్రియలు జరగనీయకుండా స్థానికులు అడ్డుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వైర‌స్ ఎంత ప్ర‌మాద‌కారో తెలియ‌జేయ‌డానికి  కర్నూలు మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్, కొవిడ్‌-19 సలహా కమిటీ సభ్యుడు, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సి. ప్రభాకర్‌రెడ్డి ప్ర‌జ‌లంద‌రికీ అర్థ‌మ‌య్యే రీతిలో వివ‌ర‌ణ ఇచ్చారు.  


కరోనా కారణంగా మరణించిన వారి దేహంలో నుంచి కరోనా వైరస్‌ మొత్తం పంపించాకే వారి కుటుంబ సభ్యులకు అప్పగించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దేహాన్ని అప్ప‌గించే ముందు  హైపోక్లోరైడ్ వాడుతార‌ని వెల్ల‌డించారు.  అయితే ఆ హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మృతదేహంలోకి పంపించి, ఆ తరువాత మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో పూర్తిగా క‌ప్పిం ఉంచి , జిప్ కవర్ తో మూసేస్తారు. అయితే స‌మీప బంధువులు క‌డసారిగా చూసుకునేందుకు  తల భాగం ఒక్కటి మాత్రమే బయటకు కనబడేలా కవర్ ఏర్పాటు చేస్తార‌ని చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మృతదేహం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని అన్నారు. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: