దేశంలో కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.  మనుషులకే కాదు.. పశు, పక్షాదులకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు.  ఆ మద్య చికెన్ కి కరోనా ఎఫెక్ట్ ఉంటుందని ప్రచారం జరిగింది. దాంతో చికెన్ రేట్లు ఒక్కసారే పడిపోయాయి.. ఎంతగా అంటే రూ.25 లకే కిలో అమ్మిన పరిస్థితి.. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా ఫ్రీగా ఇచ్చేశారు.  కోడి గుడ్ల రేట్లు కూడా దారుణంగా పడిపోయాయి. అయితే కరోనా వల్లనే కాదు ఇతర వ్యాధుల వల్ల కూడా కొన్ని పక్షులు, జంతువులు చనిపోతున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా కర్నూలులోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

 

అయితే తాజాగా కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో కోతులు మరణించడం సంచలనం రేపింది.  కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని గడివేములలో సుమారు 20కి పైగా కోతులు మరణించాయి. మరి కొన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. మనుషులకు వచ్చినట్లే కోతులకు కూడా వస్తుందా అన్న అనుమానాలు అక్కడ ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో కోతులు మరణిస్తూ ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు.  ఆ మద్య తమిళనాడు రాష్ట్రంలో పన్నియార్ వద్ద కులత్తుమేడు ప్రాంతంలో ఈ నెల 1న దాదాపు 10కి పైగా కాకులు ఒకేసారి మరణించాయి.  కాకులకు కరోనా వైరస్ సోకిందని, అందుకే ఇవి మరణిస్తున్నాయని మరికొందరు భయపడిపోయారు.. కాకపోతే వాటికి సరైన ఆహారం లేక ఇలా మరణించాయని అంటున్నారు.

 

అయితే 20 కోతులు మరణించడంతో జిల్లా ఉన్నతాధికారులు, నందికొట్కూరు పశు వైద్యాధికారులు గడివేములకు చేరుకున్నారు. పశు వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కోతుల కళేబరాలకు పోస్టుమార్టమ్ నిర్వహించారు. కరోనా వల్ల కోతులు చనిపోలేదని.. ఆహారం లేక ఆకలితో అలమటించి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం ఏపిలో కరోనా మహమ్మారి గుంటూరు, కర్నూల్, కృష్ట లో ఎక్కువ ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: