ప్రస్తుతం అందరి జీవితాల్లో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించిన వాట్సాప్... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనేకమైన కొత్త అప్డేట్స్ విడుదల చేస్తూ తమ వినియోగదారుల పనులు సులభతరమయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. కొన్ని రోజుల క్రితం వాట్సాప్ యాజమాన్యం తమ మెసేజింగ్ యాప్ ద్వారా ఎటువంటి దుష్ప్రచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు 'మెసేజ్ ఫార్వర్డ్ ఇంగ్' సదుపాయాన్ని పూర్తిగా చేంజ్ చేసిందన్న సంగతి తెలిసిందే.


అలాగే ఇప్పుడు ఫోన్ కాల్ చేసుకునే సదుపాయాన్ని మార్చేసి ఎక్కువ ఫోన్ కాల్స్ చేసేందుకు వెసులుబాటును అందిస్తుంది. వాట్సాప్ ద్వారా ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే ఒకేసారి వీడియో/ఆడియో కాల్ చేయగలరు. కానీ ఇకమీదట వాట్సాప్ ద్వారా ఏకంగా ఎనిమిది మంది ఒకసారి వీడియో/ఆడియో కాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ కేవలం వాట్సాప్ బేటా వెర్షన్ మీదేనే అవైలబుల్ అవుతుంది. మీరు వాట్సాప్ బీటా ప్రోగ్రాం కి ముందుగానే సబ్ స్క్రైబ్ చేసుకుని ఉన్న ఐ ఫోన్ యూజర్లు అయితే టెస్ట్ ఫ్లైట్ నుండి వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 ను, ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఐతే ప్లే స్టోర్ నుండి వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.132 డౌన్లోడ్ చేసుకొని సరికొత్త అప్డేట్ ఫీచర్ ని వినియోగించుకోవచ్చు.


ఒకసారి మీ వాట్సాప్ అప్లికేషన్ ని నూతన వెర్షన్ కు అప్డేట్ చేసుకున్న అనంతరం... మీరు పార్టిసిపెంట్స్ గా ఉన్న ఏదైనా గ్రూప్ లోకి వెళ్లి కుడివైపు టాప్ కార్నర్ లో ఉన్న కాల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే... మీకు ఆ గ్రూప్ లో ఉన్నటువంటి( మీ కాంటాక్ట్ లో సేవ్ అయిన వారి నంబర్లు) కనిపిస్తాయి. అప్పుడు మీరు మీకు కావాల్సిన ఏడుగురితో (అంటే మీతో కలిపి ఎనిమిది మంది) వీడియో/ఆడియో కాల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కేవలం నలుగురు మాత్రమే ఒకేసారి వీడియో/ఆడియో వాట్సాప్ కాల్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ ప్రస్తుతం 8 మంది ఒకేసారి ఆడియో/ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ ఎక్కువగా ఇంటి నుండి వర్క్ చేసేవారికి, పాఠాలు వినేవారికి, కుటుంబ సభ్యులతో మాట్లాడేవారికి, ఫ్రెండ్స్ తో మాట్లాడే వారికి చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అందరూ ఇంట్లో నుండే అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి వారి కోసమే వాట్సాప్ సంస్థ ఈ అప్ డేట్ ని రోల్ చేసిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: