విజయ సాయి రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కి 20 కోట్లకు అమ్ముడు పోయారని మధ్యలో బ్రోకర్ గా సుజనాచౌదరి ఉన్నారని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఎప్పటినుండో ఏపీలో అధికార పార్టీ ఏదైనా తప్పు చేస్తే పట్టుకోవాలని కాచుకు కూర్చున్నా ప్రతిపక్ష పార్టీలలో ఒక పార్టీ బిజెపి. అయితే జగన్ అధికారంలోకి 11 నెలలు కావస్తున్నా పెద్దగా రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు రాలేదు. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రధానులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో వైసీపీకి కరోనా పెద్ద తలనొప్పిగా మారింది.

 

దీంతో రాష్ట్రంలో అధికంగా కరోనా వైరస్ పరీక్షలు చేయాలని రాపిడ్ టెస్టింగ్ కిట్లను సౌత్ కొరియా నుండి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ కొనుగోలు విషయంలో జగన్ సర్కార్ అవినీతికి పాల్పడిందని కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి దారుణంగా ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ తరపున పెద్దగా ఎవరూ స్పందించలేదు. ఇటువంటి తరుణంలో ఈ పాయింట్ ని ఆధారం చేసుకుని హైకమాండ్ బీజేపీ వెంటనే రంగంలోకి దిగింది.

 

రాష్ట్రంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎందుకు స్పందించలేదని ఏపీ బీజేపీ నేత లను గట్టిగా ప్రశ్నించిందట. దీంతో ఒక్కసారిగా బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు...వరుసపెట్టి మీడియా సమావేశాలు నిర్వహించి విజయసాయిరెడ్డిని విమర్శలు చేయటం స్టార్ట్ చేశారు. చాలావరకు అజ్ఞాతంలో ఉన్న ఏపీ బీజేపీ నేతలు విజయసాయిరెడ్డి...కన్నా లక్ష్మీనారాయణ పై చేసిన వ్యాఖ్యలకు భారీ స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు. ఈ పరిణామం ఏపీ బీజేపీ కి విపరీతంగా కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: