అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. టెక్నాలజీ పరంగా మరియు సైనిక పరంగా తిరుగులేదు అని అనుకున్న అమెరికా కరోనా వైరస్ వల్ల చాలా వరకు నష్టపోయింది. ధనిక దేశమైన అమెరికాలో ప్రస్తుతం ఆకలి కేకలు వినబడుతున్నాయి. వైరస్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కెల్లా అమెరికాలో చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశంగాను మరియు మరణాల విషయంలో కూడా అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఈ పరిస్థితికి రావడానికి కారణం డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అని ప్రపంచ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

కరోనా వైరస్ వచ్చినా ప్రారంభంలో చాలా తేలికగా తీసుకుని...ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో అమెరికాలో ప్రమాదకరమైన స్థితిలో వైరస్ వ్యాపించి ఉందని ఆ దేశానికి చెందిన వాళ్లు అంటున్నారు. వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేస్తుందని ప్రజలను నమ్మించి...పరిస్థితిని ఈ స్థాయి వరకు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారని మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఉండటంతో పాటుగా ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటంతో డోనాల్డ్ ట్రంప్ ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వల్ల అమెరికాలో ఎవరు ఉద్యోగాలు కోల్పోవడం జరగదు అని.. అమెరికాలో ఉన్న ఇతర దేశస్తు లను వాళ్ల స్వదేశాలకు పంపించడానికి రెడీ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.

 

దీంతో అమెరికాలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చెందిన వాళ్లు గ్రీన్ కార్డు కలిగిన వాళ్ళు ట్రంప్ ప్రకటన పట్ల ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే ప్రకటనపై అంతర్జాతీయ స్థాయిలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఎప్పటినుండి అమెరికాలో కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న తమ దేశస్థుల పట్ల అలా వ్యవహరించవద్దని చాలా మంది అమెరికాని కోరుతున్నారు. సమస్యతో పోరాటంలో విఫలం అయింది మీరు అయితే...దేశంలో ఉన్న ఇతర దేశస్తులు పాలెం చేస్తారని డోనాల్డ్ ట్రంప్ ప్రకటన పట్ల ఇతర దేశస్తులు విమర్శలు చేస్తున్నారు.

 

కానీ డోనాల్డ్ ట్రంప్ మాత్రం వచ్చే అధ్యక్ష ఎన్నికలను అమెరికాలో ఉన్న ఇతర దేశస్తుల ను పంపించేసి ఉద్యోగాలు అమెరికన్లకు మాత్రమే అన్న నినాదంతో వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఇదే జరిగితే కనుక డోనాల్డ్ ట్రాంప్ మరియు అమెరికా దేశం ఒంటరి అయిపోతుందని.. ప్రపంచంలో ఎవరూ కాపాడే పరిస్థితి కూడా ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: