క‌రోనా వైర‌స్ కేంద్ర‌, రాష్ట్ర  ప్ర‌భుత్వాల‌కు షాక్‌ల మీద షాక్‌లిస్తోంది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వ‌ర‌కు మొద‌టి ద‌శ‌గా లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి తెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం వ్యాధి అదుపులోకి రాలేద‌ని నిర్ధారించుకుని..రాష్ట్ర ప్ర‌భుత్వాల సూచ‌న మేర‌కు, పెరుగుతున్న కేసుల సంఖ్య‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని లాక్‌డౌన్‌ను మే3 వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు వారం గ‌డిచిపోయింది. మే3 గ‌డువుకు స‌రిగ్గా మ‌రో రెండు వారాల స‌మ‌యం ఉంది. అయితే క‌రోనా వైర‌స్ మాత్రం ఉధృతిని కొన‌సాగిస్తోంది. గ‌తంలో క‌న్నా చాలారెట్లు..వేగంగా విస్త‌రిస్తున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. మ‌ర‌ణాలు కూడా 500మార్కును దాటేశాయి. 

 

ఇక రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా వెయ్యికిపైగా న‌మోద‌వుతుండ‌టం కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే సోమ‌వారం నాటికి 4000ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఇక గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, తెలంగాణ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, తమిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో వ్యాధి తీవ్ర‌త క‌న‌బ‌డుతూనే ఉంది. మే3 నాటికి క‌రోనా అదుపులోకి రాకుంటే లాక్‌డౌన్ కొన‌సాగిస్తారా..? అన్న ప్ర‌శ్న జ‌నాల‌ను వేధిస్తోంది. ఇప్ప‌టికే వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయి. కూలీ నాలీ చేసుకునే బీద కుటుంబాలు చేతిలో చిల్లి గ‌వ్వ‌లేకుండా న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నాయి. 


కేంద్ర వ‌ర్గాల ద్వారా విశ్వ‌స‌నీయంగా తెలుస్తోదేమంటే.. మే 3 తర్వాత కూడా క‌రోనా అదుపులోకి రాలేద‌ని నిర్ణ‌యానికి వ‌స్తే.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలైతే కనిపించడం లేదు. సామాజిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటే జ‌న‌జీవ‌నాన్ని సాధార‌ణ స్థితికి తీసుకురావాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌జార‌వాణాపై, దూర ప్ర‌యాణాల‌పై మాత్రం య‌థావిధిగా ఆంక్ష‌లు కొన‌సాగుతాయి. విమానాలు, రైళ్లు మే 3 తర్వాత సేవలు ఆరంభించవని స‌మాచారం. అయితే  కొన్ని రోజులకు నిర్దేశించిన పట్టణాల మధ్య ప్రయాణాలకే అనుమతి ల‌భించ‌నుంది. మాస్క్‌లు, వ్యక్తిగత దూరం పాటించ‌డం వంటివాటిని నిర్బంధంగా అమ‌లు చేయ‌నున్నారు. ఇక  పెళ్లి వంటి శుభకార్యాలు, మత సమ్మేళనాలపై ఆంక్షలు కొనసాగుతాయి. మే 15 తర్వాత దేశంలో కరోనా అసలైన స్థితి తెలియనుందని కేంద్ర వ‌ర్గాలు భావిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: