గత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాలు కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల మీద నడుస్తున్నాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచాలనే నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లని దిగుమతి చేసుకుంది. ఇక ఇవే టెస్ట్ కిట్లని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కూడా దిగుమతి చేసుకుంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఛత్తీస్ ఘడ్ రూ. 337 ప్లస్ జీఎస్టీతో కిట్లని కొనుగోలు చేస్తే, ఏపీ ప్రభుత్వం రూ.700 పైనే పెట్టి కిట్ల కొనుగోలు చేసినట్లు తెలిసింది. 

 

దీంతో వైసీపీ ప్రభుత్వం కరోనా టెస్ట్ కిట్లలో కమిషన్ నొక్కేసిందని టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి సీఎం జగన్ క్లారిటీ కూడా ఇచ్చారు. తాము కిట్లు కొనుగోలు చేసే ముందు, ఓ రూల్ పెట్టామని, ఇప్పుడు అమ్మే ధరకు కాకుండా, తక్కువ ధరకు ఏదైనా రాష్ట్రానికిస్తే అదే ధర తాము కూడా చెల్లిస్తామని, కాబట్టి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మాదిరిగానే చెల్లిస్తామని చెప్పారు.

 

అయితే ఇక్కడితో కథ అయిపోయింది అనుకుంటే కష్టమే. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలుపై టీడీపీ,బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంతకముందు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. శవాల మీద పేలాలు ఏరుకునే పచ్చ మాఫియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపైన ఏడుపు మొదలు పెట్టిందని, ఛత్తీస్ గడ్ రూ. 337 కు కొంటే మీరు 700 దాకా ఎలా పెడతారని అంటున్నారని చెప్పి విజయసాయి ఓ క్లారిటీ ఇచ్చారు. ఛత్తీస్ ఘడ్ కొన్నవి దేశంలోనే తయారైనవని, రిజల్ట్ కు 30 నిమిషాలు పడుతుందని, సిఎం జగన్ గారు కొరియా నుంచి తెప్పించినవి 10 ని.ల్లోనే కచ్చితమైన ఫలితాలు చూపుతాయని చెప్పారు.

 

ఇక ఇక్కడే తేడా కొడుతోందని, తమ్ముళ్లు అంటున్నారు. అంటే విజయసాయి చెప్పినట్లు చూసుకుంటే ఛత్తీస్ ఘడ్, ఏపీ ప్రభుత్వాలు కొనుగోలు చేసిన కిట్లు వేరువేరని, ఏపీ కొనుగోలు చేసినవి మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని చెప్పారని తెలుస్తోంది. రెండు వేరు వేరు అయితే, ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ చెల్లించినట్లే, తాము కూడా అంతే ధర చెల్లిస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతుంది. అంటే రెండు కిట్ల క్వాలిటీ ఒకటే అని దీని బట్టి అర్ధమవుతుంది. మరి ఈ రెండింటిలో ఏది నిజమో వైసీపీకే తెలియాలని, మొత్తానికి కమిషన్ నొక్కేసారనే ఆరోపణలు కవర్ చేసుకునే నేపథ్యంలో ఇలా, రెండు మాటలు చెబుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: