ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న, కేసులు ఊహించని విధంగా పెరుగుతూ వెళుతున్నాయి. ప్రస్తుతానికి ఏపీలో 757 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 639 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా కేసులు పెరగడం పక్కనబెడితే, దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది.

 

రోజూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీ, వైసీపీపై మరింతగా విమర్శలు చేస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, కరోనా కేసులు దాచిపెడుతున్నారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక టీడీపీ లైన్ లోకి బీజేపీ కూడా వెళ్లి అదేవిధంగా విమర్శలు చేస్తుంది.

 

తాజాగా కూడా లాక్ డౌన్ రూల్స్ వైసీపీ నేతలు పాటించడం లేదని, వైసీపీ నేతల వల్లే కరోనా వ్యాప్తి పెరుగుతుందని రెండు పార్టీల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక వీరికి వైసీపీ కార్యకర్తలు కూడా గట్టి కౌంటర్లే ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి పెరగకుండా జగన్ ఏ విధంగా కృషి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద వాళ్ళని కూడా ఆదుకుంటున్నారని చెబుతున్నారు.

 

ఇక కరోనా పెరగడానికి వైసీపీ నేతలే కారణం అనేవాళ్లకు కూడా గట్టి సమాధానమే ఇస్తున్నారు. కరోనా దెబ్బకు భయపడి టీడీపీ నేతలు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదని, కానీ తమని గెలిపించిన ప్రజల కోసం తమ నేతలు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారిని ఆదుకుంటున్నారని, ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు, శాని టైజర్స్ పంపిణీ చేస్తున్నారని, అది కూడా పలు జాగ్రత్తలు పాటిస్తూ అందిస్తున్నారని అంటున్నారు. అటు విజయసాయిరెడ్డి లాంటి నేతలు విరాళాలు సేకరిస్తున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: