దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాపై రాజకీయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనుకుంటా.  అసలు దేశం మొత్తం కరోనాని ఎలా కట్టడి చేయాలనే చూస్తూ, అధికార, విపక్షాలు కలిసి కట్టుగా ముందుకెళుతున్నాయి. ఆఖరికి రాహుల్ గాంధీ సైతం రాజకీయాలు పక్కనబెట్టి, మోదీకి సహకరిస్తున్నారు. ఇక పక్కనే ఉండే తెలంగాణలో కూడా విపక్షాలు, కేసీఆర్ సర్కార్ ని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు.

 

కానీ ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష టీడీపీ రోజూ ఏదొకటి అంటూనే ఉంటుంది. చంద్రబాబు తెలివిగా సలహాలు ఇస్తున్నట్లే ఇస్తూ, జగన్ ప్రభుత్వంపై బురద జల్లేస్తున్నారు. ఇక ఆయన్ని బట్టి, టీడీపీ నేతలు కూడా రోజూ ప్రెస్ మీట్ పెట్టడం, కరోనా వ్యాప్తి అరికట్టడంలో జగన్ ఫెయిల్... కరోనా కేసులని ప్రభుత్వం దాచిపెడుతుంది...వైసీపీ నేతలు విచ్చలవిడిగా తిరిగేస్తూ, కరోనా పెంచుతున్నారంటూ విమర్సలు చేస్తున్నారు.

 

ఇక వీరికి ఇప్పుడు బీజేపీ కూడా తొడయ్యింది. తాజాగా ఈ రెండు పార్టీలు కలిసి జగన్ ప్రభుత్వం కరోనా టెస్ట్ కిట్లపై కమిషన్ నొక్కేసిందని ఆరోపణలు చేస్తున్నాయి. వీరు చేసే ఆరోపణలకు వైసీపీ నేతలు కూడా స్ట్రాంగ్ రియాక్ట్ అవుతూ, కౌంటర్లు ఇస్తున్నారు. కొందరు నేతలు అయితే, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారిని ఏకిపారేస్తున్నారు. వారు గుడ్డిగా విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. 

 

ఇదే సమయంలో చంద్రబాబు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయాల్సినవి, చేస్తూ వైసీపీ కరోనా వ్యాప్తి అరికట్టడానికి కాకుండా, రాజకీయం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటూ తెలివిగా విమర్శలు చేస్తున్నారు. ముందేమో ఇష్టారాజ్యంగా విమర్శలు చేసేసి, తర్వాత వైసీపీ నేతలు ఏమన్నా వాటిపై స్పందిస్తే, రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు పనికిమాలిన రాజకీయం చేస్తున్నారు. ఏదేమైనా ఎవరు ఏం చేస్తున్నారో, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.  చంద్రబాబు రాజకీయం అందరికీ తెలిసిందే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: