నిన్నటి వరకు కరోనా కేసుల్లో సింగిల్ డిజిట్ దాటని కేరళ.. తాజాగా డబుల్ డిజిట్ కేసులను నమోదు చేసింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 10 రోజుల నుండి అక్కడ అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ19 కేసులతో  కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య కేరళలో 426 కు చేరింది. ఇందులో 117 కేసులు ప్రస్తుతం యాక్టీవ్ లో ఉండగా 307 బాధితులు కోలుకున్నారు. ఇద్దరు మరణించారు. కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర సరిహద్దుల దగ్గర కఠినమైన ఆంక్షలు విధించినట్లు సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ రోజు తెలంగాణలో కొత్తగా 56 కరోనా కేసులు నమోదు కాగా ఇందులో ఒక్క సూర్యపేట లోనే 26 కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈకొత్త కేసులతో కలిపి రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 928కు చేరింది. ఇక ఆంధ్రా లో ఈరోజు మరో 35 కేసులు నమోదు కావడం తో  కేసుల సంఖ్య 757 కు చేరింది. అందులో 22 మంది మరణించారు. ఓవరాల్ గా  దేశ వ్యాప్తంగా  కరోనా బాధితుల సంఖ్య 19000 కు దాటాగా 600 కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: