కరోనా భయం పట్టుకుంది. ఎటు చూసిన కూడా కరోనా మాటనే వినపడుతుంది..రోజు రోజు కూ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.. మరీ కొందరు మాత్రం కరోనా కారణంగా  క్వారంటైన్ లో బాధపడుతున్నారు.. ఇకపోతే కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది.. అయినా కూడా కరోనా ప్రభావం ఎక్కడా తగ్గలేదు.. 

 

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

 


కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. అనంతపురం జిల్లా మార్కెట్ యార్డులో రైతులు నిరసన కు దిగారు.. కరోనా కారణంగా రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. 

 

 

 

ఈ సందర్భంగా అనంతపురం రైతు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కారణంగా రైతులు నష్టపోయారని అన్నారు.  వేల ఎకరాల్లో పండించిన ఉద్యానవనం పంటలను పండించిన లాక్ డౌన్ కారణంగా కొనేవారు లేక ,మార్కెట్లకు తీసుకొచ్చిన పండ్లను పశువులకు , పేదలకు పంచుతున్నమని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని పంటను కొనుగోలు చేయాలని విన్నవించారు.. అలాగే నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధరగా ఎకరానికి 80 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: