పేదవాడి అని లేదు ప్రధాని అని లేదు ఎవరినీ వదిలిపెట్టడం లేదు కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు పైగా నే కేవలం మూడు నెలల్లోనే పాకి పోయింది. ఈ మూడు నెలలలో ఈ వైరస్ వల్ల కొన్ని వేల మంది చనిపోగా లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే ఈ వైరస్ నుండి బయటపడటానికి అనేక తిప్పలు పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా రాష్ట్రపతి భవన్ నీ కూడా ఇరకాటంలో పెట్టింది కరోనా వైరస్. 

 

రాష్ట్రపతి భవన్ లో పనిచేసే ఓ వ్యక్తికి కరుణ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో 100 మందిని క్వారంటైన్ కు తరలించారు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నాలుగు రోజుల క్రితం తేలింది. మిగతా అందరికీ నెగెటివ్ వచ్చింది. సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లాలని 125 కుటుంబాలను అధికారులు ఆదేశించారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. మొదటిలో విదేశాలనుండి వచ్చిన వారి వల్ల మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో చాలావరకూ ప్రభుత్వాలు కంట్రోల్ చేయగలిగాయి. 

 

అయితే ఎప్పుడైతే ఢిల్లీ ఘటన బయట పడిందో.. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లెక్కలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలో 40 శాతం వరకు నమోదైన పాజిటివ్ కేసులలో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారి వల్లే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: