కరోనా వైరస్ వల్ల అగ్రరాజ్యం అమెరికాలోని ఆకలికేకలు వినబడుతున్నాయి. ప్రపంచంలోని ధనిక దేశం మరియు శక్తివంతమైన దేశంగా పిలవబడే అమెరికా కరోనా వైరస్ దెబ్బకి తీవ్రంగా నష్టపోయింది. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మార్చి నెల నుండి వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ అన్ని రంగాల్లో క్లోజ్ అయిపోయాయి. ఏ రోజుకి ఆ రోజు బతికే పేద వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారింది.

 

ఇటువంటి టైములో బీహార్ రాష్ట్రంలో ఒక హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా లో ఇస్లాంపూర్ కి చెందిన ఓ 16 ఏళ్ల బాలుడికి తమ్ముడు మరియు తల్లి ఉన్నారు. తల్లి మానసిక పరిస్థితి బాగాలేదు. దీంతో ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్న పోషణ 16 సంవత్సరాల బాలుడు పై పడింది. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ విధించ‌డంతో పనులు లేకుండా పోయాయి. దీంతో ఇటువంటి టైములో కుటుంబంలో రోజూ గడవడానికి సమస్యగా మారడంతో...తినటానికి కూడా ఆహారం లేకపోవడంతో ఇంకా 16 ఏళ్ల యువకుడు ఒక ఓ ప‌ర్సు దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడు.

 

పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేసి జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు. ఈ కేసును విచారించిన జ‌డ్జి మాన‌వేంద్ర‌మిశ్రా...కేసు పూర్వాప‌రాల‌ను తెలుసుకున్నారు. త‌ల్లి, త‌మ్ముడి ఆక‌లి బాధ చూడ‌లేక‌ దొంగ‌తనానికి పాల్ప‌డిన‌ట్టు బాలుడు అంగీక‌రించ‌డం...ఆ జ‌డ్జిని క‌ల‌చివేసింది. దీంతో ఆ బాలుడికి ఏ శిక్ష వేయాల‌నే అంశానికి బ‌దులు ఎలా సాయం చేయాలో జ‌డ్జి ఆలోచించారు. వెంటనే బాలుడు కుటుంబానికి రేషన్ మరియు పక్కా ఇల్లు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను వెంటనే అందించాలని సంబంధిత అధికారులకు జడ్జి ఆదేశించారు.

 

నాలుగు నెలలలో సంక్షేమ పథకాలన్నీ ఆ కుటుంబానికి వర్తించని దానికి సంబంధించి వివరాలు రిపోర్ట్ కూడా నాలుగు నెలల్లో తనకు అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆ బాలుడు కథ విన్న చాలా మంది కోర్టులో ఉన్న వాళ్ళు కంటతడి పెట్టారు. బీహార్ రాష్ట్రంలో ఈ వార్త సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: