రాజకీయాల్లో చరిత్ర ఎన్నడూ చూడని దిగ్గజం అటల్ బిహారీ వాజపేయి. ఆయన దేశ రాజకీయాలను శాసించిన తీరు అందరిని తన వైపుకి తిప్పుకోవడమే కాకుండా తన ప్రసంగాలతో ప్రపంచ దేశాలను సైతం కట్టిపడేసిన తీరు ఎందరినో ఆకట్టుకుంది. రాజకీయాల్లో ఆయన ముందు ఆయన తర్వాత అన్నట్టు ఉండేది పరిస్థితి. కవి గా, నాయకుడిగా, పాలకుడిగా మంచి విద్యార్ధిగా దేశ ప్రజలకు అత్యంత ఆప్తుడిగా వాజపేయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విమర్శకులు అయినా సరే ఆయనను కీర్తించాల్సిందే. 

 

అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు అనే సంగతి అందరికి తెలిసిందే. తన జీవితంలో మొత్తం ఎక్కువగా ఆయన సొంత ఇంట్లో ఉండటం తనకు తానుగా ఏమీ చేసుకోలేని సమయంలో తన సోదరి ఇంట్లో ఉండటమే గాని ఎవరి ఇంటికి ఆయన వెళ్ళలేదు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోమని ఎందరు వచ్చి అడిగినా సరే ఆయన మాత్రం అందుకు అంగీకరించలేదు. దానికి కారణం ఏంటీ అంటే ఆయనకు ఒక ప్రేమ వ్యవహారం ఉంది. తన తోటి విద్యార్ధిని ఆయన గాడంగా ప్రేమించారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆమె విషయంలో ఆయన చాలా సానుకూలంగా ఉండే వారు. 

 

ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు గాని ఒకరి మనసులో మాటను ఒకరు బయటపెట్టలేక దూరం అయ్యారు. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది. అయినా సరే ఇద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగింది. చివరికి ఆమె భర్త చనిపోవడంతో ఆమెను దగ్గర చేసుకోకపోయినా ఆమె కుమార్తె ను మాత్రం ఆయన దగ్గర చేసుకుని పెంచుకున్నారు. జీవితంలో ఆయన చివరి వరకు ఆమె ఉన్నట్టు చెప్తారు. దీనిపై ఎవరికి స్పష్టత లేదు. అయినా సరే ఆ ప్రేమ వ్యవహారం రాజకీయాల్లో ఒకప్పుడు హాట్ టాపిక్ అని...  ఆయన ఆ విషయాన్ని కేవలం ఒక్కసారే మీడియా ముందు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: