కరోనా సమయంలో హైదరాబాద్ లోని నివాసానికి పరిమితమైన మాజీ సీఎం చంద్రబాబు తరచూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ వైసీపీ సర్కారు పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా.. కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై విమర్శలు గుప్పించారు. కరోనా కిట్ల కొనుగోలులో వైసీపీ నాయకులు కక్కుర్తిపడ్డారని చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

 

 

అంతే కాదు.. పట్టుబడిన తర్వాత ధర తగ్గించుకుంటామని ఇప్పుడు వైసీపీ నాయకులు చెబుతున్నారని, ఒకే కంపెనీ కిట్లకు పొరుగు రాష్ట్రం కంటే రెట్టింపు ధర పెట్టి ఇప్పుడు సంజాయిషీలు ఇచ్చుకుంటే ఏం ఉపయోగమని చంద్రబాబు విమర్శిస్తున్నారు. కిట్ల కొనుగోలుకు కనీసం అత్యవసర టెండర్‌ కూడా పిలవలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఛత్తీస్‌ గఢ్ ఒక కిట్‌కు రూ.378 పెడితే మన ప్రభుత్వం రూ.730 పెట్టిందని లా పాయింట్ లాగుతున్నారు. తమ ధరను చత్తీస్ గఢ్ మంత్రి బహిరంగంగా ప్రకటించడంతో వైసీపీ వ్యవహారం బయటకు వచ్చిందని విమర్శిస్తున్నారు.

 

 

అంత వరకూ బాగానే ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు చాలా విషయాలను దాచి పెడుతున్నారనే చెప్పాలి. ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే తక్కువ ధరకు కిట్లు ఇస్తే.. ఆ ధరే తమకు వర్తిస్తుందని పర్చేజ్ ఆర్డర్‌లోనే కండీషన్ పెట్టామని వైసీపీ సర్కారు చెబుతోంది. ఆ విషయం మాత్రం చంద్రబాబు ప్రస్తావించడం లేదు. మరో కీలకమైన విషయం ఏంటంటే.. కేంద్రం కూడా ఇవే కిట్లను ఇంతకంటే ఓ 50 రూపాయలు ఎక్కువే వెచ్చించి కొన్నది.

 

 

మరి జగన్ సర్కారు కక్కుర్తి పడిందని ఆరోపిస్తున్న చంద్రబాబు.. మోడీపై ఇంకెంతగా విమర్శలు గుప్పించాలి. జగన్ ది కక్కుర్తి అయితే మోడీది అంత కంటే ఎక్కువ కక్కుర్తి అవుతుంది కదా. మరి మోడీ విషయాన్ని మాత్రం చంద్రబాబు అస్సలు ప్రస్తావించడం లేదెందుకు..? దమ్ములున్న చంద్రబాబు ఆ కక్కుర్తి ప్రశ్న ఏదో ప్రదాని మోడీని కూడా అడగవచ్చు కదా అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ ప్రశ్న.

 

మరింత సమాచారం తెలుసుకోండి: