వార్త దీనికున్న శక్తి అణుబాంబు లాంటిది.. ఎందుకంటే చచ్చిన వాన్ని బ్రతికితుంది.. బ్రతికిన వాన్ని చంపేస్తుంది.. తన కలంలో ఉన్న బలంతో ఏదైనా చేసేస్తుంది.. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. ఎక్కడైన ఒకడు పిల్లితోకను చూసి భయపడ్డాడనుకో.. అక్కడి నుండి పులితోకను చూసి భయపడిన వ్యక్తి అని వార్త వాయువేగం కంటే ముందుగా చేరుతుంది.. ఇంతటి శక్తి ఉన్నది ఈ వార్తకు.. ఇకపోతే గత కొన్ని రోజుల నుండి ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య విషయంలో పలు కధనాలు ప్రవాహంలా వెల్లువెత్తుతున్నాయి.. అతనికి కరోనా సోకిందని, లేకుంటే అనారోగ్యం బారినపడ్డాడనే రుజువుకానీ ప్రచారం జరుగుతుంది.. ముఖ్యంగా కిమ్ అంటే అమెరికాకు భయం.. ఇదే సమయాన్ని అనుకూలంగా తీసుకుని అమెరికా పత్రికలు కిమ్ జాంగ్ ఉన్ పై జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయట..

 

 

ఇకపోతే అధికారికంగా మాత్రం కిమ్ ఆరోగ్యం పై ఎలాంటి సమాచారం లేదు.. ఇకపోతే ఒక వేళ కిమ్ కు ఏదైనా జరిగితే అనుకుందాం.. అప్పుడు ఆదేశ పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయనే ప్రశ్న ప్రతి వారిలో కలుగుతుంది.. అసలే కిమ్ ఒక నియంత.. మొండి వాడనే పేరు కూడా ఉంది.. మరి ఇలాంటి పరిస్దితుల్లో కిమ్ తరువాత బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారు అనే దానికి ఒక సమాధానం జోరుగా ప్రచారం సాగుతుంది.. అదేమంటే కిమ్ చిన్న చెల్లెలు కిమ్ యో జోంగ్  పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈవిడ కిమ్ కంటే యమ ఫాస్టనే టాక్ కూడా ఉంది.. ఇప్పటికే ఆదేశ వ్యవహారాల్లో రాటుతేలిందని.. అంతే కాకుండా కిమ్ దగ్గరికి చొరవగా వెళ్లి సలహాలు కూడా అందించే అధికారం ఈమెకు ఉందని తెలుస్తుంది..

 

 

అంతే కాదు కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆమె హస్తం ఉన్నట్టుగా ఉత్తర కొరియా మీడియా చెప్పకనే చెప్తున్నది. ఇకపోతే గత కొంతకాలంగా ఆమె జాతీయ రాజకీయాల్లో కీలక, చురుకైన పాత్రను పోషిస్తోంది. అధ్యక్షుడికి ఏమైనా జరిగితే బాధ్యతలు స్వీకరించడానికి అనుగుణంగానే ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కూడా ప్రచారం సాగింది. ఇప్పుడు అది నిజం అవుతుందనే అంటున్నారు విశ్లేషకులు. ఒక విధంగా చెప్పాలంటే కిమ్ కంటే కూడా అయన సోదరి కిమ్ యో జోంగ్ చాలా పవర్ఫుల్ లీడర్ అని కొందరి అభిప్రాయం. కాగా కిమ్ ను మించిన కఠినాత్మురాలని మరికొందరి భావం.. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: