అమెరికాకు వ‌ల‌స‌ల‌ను నిషేధిస్తున్న‌ట్లుగా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే మంగ‌ళ‌వారం ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించిన ఆయ‌న బుధ‌వారం కాస్త డీటెల్డ్‌గా విధివిధానాల‌పై స్ప‌ష్ట‌త నిచ్చారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పేర్కొన్న దాని ప్ర‌కారం..దాదాపు 60 రోజుల‌ పాటు వ‌ల‌స‌ల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. ఇది కేవ‌లం తాత్క‌లికంగా దేశంలో ఏర్ప‌డిన సంక్షోభం నుంచి గ‌ట్టేందుకు తీసుకుంటున్న నిర్ణ‌యంగా ఆయ‌న చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ అనంత‌రం తొలుత అమెరికా ప్ర‌జ‌ల‌కే 
ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించాల‌నే ఉద్దేశంతోనే తాను ఈనిర్ణ‌యం తీసుకున్నాన‌ని స‌మ‌ర్థించుకున్నారు.

 

ఇదిలా ఉండ‌గా శాశ్వత నివాస హోదా(గ్రీన్‌ కార్డు) కోసం వచ్చేవారిని లక్ష్యంగా చేసుకునే అమల్లోకి తెస్తున్నట్లు అర్థమవుతోంది. ‘‘ అమెరికాలోని నిరుద్యోగ పౌరులకు ప్రయోజనం ఉండాలనే ఉద్దేశంతోనే వలసల్ని నిలిపివేయాలని నిర్ణ‌యించుకున్నాం. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత  స్థానికుల‌కు  ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఉండేందుకు ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నాం అంటూ ట్రంప్ త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు.  వైరస్‌ విజృంభణ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి స్థానంలో వలస వచ్చిన వారిని చేర్చుకుంటే దేశ పౌరుల‌కు అన్యాయం చేసినట్లే అవుతుంద‌ని వ్యాఖ్య‌నించారు.  అమెరికా పౌరుల సంక్షేమమే మా తొలి ప్రాధాన్యమ‌ని కూడా చెప్పుకొచ్చారు. 

 

ట్రంప్‌ ప్రకటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వలస విధానాలను కఠినతరం చేయాలని చూస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అనేక దేశాల్లోని ప్ర‌జ‌లు ట్రంప్ నిర్ణ‌యంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆక‌స్మాత్తుగా ట్రంప్ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డంతో త‌మ క‌ల‌లు క‌ళ్ల‌లయ్యాయ్య‌ని వాపోతున్నారు. ఇక అమెరికాకు వ‌ల‌స వెళ్లేవారిలో భార‌త్‌, చైనా దేశాస్థులే అధిక‌మ‌ని చెప్పాలి. మొద‌టి నుంచి ఆయ‌న వ‌ల‌సల‌ను నియంత్రించాల‌ని చూస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా కోవిడ్‌-19ను అడ్డుపెట్టుకుని ట్రంప్ త‌న సొంత అజెంఆను అమ‌లు చేస్తున్నాడ‌ని అమెరిక‌న్లు పేర్కొంటున్నారు. కరోనాను నియంత్రించడంలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారని..ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రకటన చేశారని అక్కడి వారు విమర్శిస్తున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: