దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా భారీన పడి మన దేశంలో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అయితే కరోనా వైరస్ జంతువులపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో చాలామంది జంతువులకు కరోనా సోకదని భావిస్తున్నారు. తాజాగా కేరళలో నాలుగు పిల్లులు మృత్యువాత పడటం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 
 
సాధారణంగా ఇళ్లలో, రోడ్లపై పిల్లులు మృతి చెంది ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆ పిల్లులు కరోనా ఆస్పత్రిలో మృతి చెందటంతో ఆ రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వల్లే పిల్లులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వార్త రాష్ట్రంలో వైరల్ అవ్వడంతో వైద్యాధికారులు రంగంలోకి దిగారు. వైద్యులు మృతదేహాల కలేబారాల నుంచి శాంపిల్స్ సేకరించారు. 
 
ఆ శాంపిల్స్ ను అధికారులు నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబ్ కు పంపించారు. కేరళ రాష్ట్రంలోని కాసర్ గడ్ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అదే జిల్లాలో పిల్లులు చనిపోవడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం బెల్జియంలో మనిషి నుంచి పిల్లికి కరోనా సంక్రమించినట్లు తేలింది. ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి పిల్లి నుంచి పిల్లికి కరోనా సోకుతుందని తేల్చారు. 
 
పిల్లుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందా...? అనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి భారిన పడి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మృతి చెందుతున్నారు. ఈ వైరస్ ఎప్పుడు... ఎక్కడ... ఎవరినుంచి ఎవరికి సోకుతుందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పెంపుడు జంతువుల నుంచి కూడా మనుషులకు కరోనా సోకితే మాత్రం కరోనా బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: